సెలబ్రిటీ డిన్నర్ టిక్కెట్లు బయట వాళ్లు ఎన్ని కొన్నారు? సెల్రబిటీలు ఎన్ని కొన్నారు. సెలబ్రిటీ డిన్నర్ కు సెలబ్రిటీలు టికెట్ లు కొనాల్సిన, కొనిపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
అలాగే క్రికెట్, కబడ్డీ టికెట్ లు కోటాల వారీగా కేటాయించారని వినిపిస్తున్న వార్తలు వాస్తవమా కాదా?
అసలు నేరుగా ప్రజలు కొన్న టిక్కెట్లు ఎన్ని?
మేము సైతం కార్యక్రమంలో పాల్గొని తీరాలని, చాలా మంది చిన్న, మీడియం స్థాయి సినిమా జనాలకను వత్తిడి చేసారని వినిపిస్తున్న వార్తలు వాస్తవమేనా?
ప్రస్తుతం పాపులర్ ఇమేజ్ వున్న యువ నటులు మేము సైతం స్టేజ్ మీదకు ఎందుకు రాలేదు? వారంతా ఈ స్టేష్ షోలు చేయమని, క్రికెట్, కబడ్డీ ఆడతామని కరాఖండీగా చెప్పారని వినిపిస్తున్న వైనం వాస్తవమేనా?
మేము సైతం ప్రసార హక్కులకు బిడ్లు ఆహ్వానించారా లేదా? ఆహ్వానించి వుంటే మాటీవీ వేసిన బిడ్డింగ్ ఎంత?
ముందు మొత్తం కార్యక్రమం లైవ్ చేద్దామని అనుకున్న వారు, మళ్లీ కొంత రికార్డింగ్, కొంత లైవ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ విషయం దాచి పెట్టి, అంతా లైవ్ అన్నట్లు ఎందుకు కవరింగ్ ఇచ్చారు?
మేము సైతం కార్యక్రమ నిర్వహణకు అయిన ఖర్చు ఎంత? పదకొండున్నర కోట్ల విరాళం రాబట్టడానికి చేసిన ఖర్చు ఎంతో కూడా ఓపెన్ గా ప్రకటించగలరా?
ఇవన్నీ బయటకు పెదవి విప్పడానికి జంకే టాలీవుడ్ జనాలు వినిపిస్తున్న ఫ్రశ్నలు. టాలీవుడ్ లో వున్న కట్టుబాట్లు, కక్షసాధింపులకు భయపడి మాట్లాడకుండా ఊరుకున్నవారు, ఒకరికి ఒకరు కలిసినపుడు వినిపిస్తున్న ప్రశ్నలివి.