ఫైనాన్షియర్ ఇరుక్కున్నాడు

భారీ సినిమాలకు ఫైనాన్స్ భారీగానే వుంటుంది. కానీ సినిమా సకాలంలో విడుదల కాకుంటే అప్పు ఇచ్చిన వారికి కాస్త ఇబ్బందే. చేయి తిరగడం కాస్త కష్టమవుతుంది. ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో ఓ లీడింగ్…

భారీ సినిమాలకు ఫైనాన్స్ భారీగానే వుంటుంది. కానీ సినిమా సకాలంలో విడుదల కాకుంటే అప్పు ఇచ్చిన వారికి కాస్త ఇబ్బందే. చేయి తిరగడం కాస్త కష్టమవుతుంది. ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో ఓ లీడింగ్ ఫైనాన్షియర్ పరిస్థితి ఇదే. 

అప్పిచ్చిన ఒకటి రెండు సినిమాలు ఆగిపోవడం, మరో సినిమా చిరకాలంగా నిర్మాణంలో వుండడంతో కాస్త టైట్ గా వుందిట పరిస్థితి. రేయ్ సినిమా ఆగిపోవడం వల్ల ఫైనాన్స్ చేసిన వారు ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు. అలాగే రుద్రమ దేవికి ఇరవై నుంచి పాతిక వరకు ఫైనాన్స్ చేసారని, ఆ సినిమా ఇంకా రెడీ అవుతూనే వుందని కిందా మీదా అవుతున్నారట. 

దాదాపు ఈ మధ్య సినిమాలన్నీ ఫైనాన్స్ చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్టీఆర్-పూరి సినిమాకు కూడా నిర్మాత బండ్ల, ఓ పెద్ద సంస్థ దగ్గర భారీగా ఫైనాన్స్ తీసుకున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో సినిమాలు తీసిన పెద్దసంస్థలు ఒకటి రెండు ఇప్పుడు నిర్మాణాలు తగ్గించి, ఫైనాన్స్ లో పడి, అదే బాగుందునుకుంటున్నాయట.