ఈటీవీ ప్రభాకర్ అడ్వాన్స్ పట్టేసాడు

ప్రభాకర్ అనే కన్నా ఈటీవీ ప్రభాకర్ అంటేనే తెలుస్తుంది. ఇప్పుడు అతగాడూ పెద్ద స్క్రీన్ పై డైరక్టర్ అయిపోతున్నాడు. ఏం లైన్ చెప్పాడో..ఏం చేసాడో కానీ, గీతా ఆర్ట్స్ నుంచి రెండు లక్షలు అడ్వాన్స్…

ప్రభాకర్ అనే కన్నా ఈటీవీ ప్రభాకర్ అంటేనే తెలుస్తుంది. ఇప్పుడు అతగాడూ పెద్ద స్క్రీన్ పై డైరక్టర్ అయిపోతున్నాడు. ఏం లైన్ చెప్పాడో..ఏం చేసాడో కానీ, గీతా ఆర్ట్స్ నుంచి రెండు లక్షలు అడ్వాన్స్ పట్టేసాడని తెలిసింది. గీతా ఆర్ట్స్ ఇక చకచకా చిన్న సినిమాలు చేయబోతోంది. అందులో భాగంగానే ఈ సినిమా కూడా వస్తుంది. 

ఆట ప్రోగ్రామ్ తో పాపులర్ అయిన ఓంకార్ ఇప్పటికే పెద్ద స్క్రీన్ పై తన అదృష్టం పరీక్షించేసుకుని, సైలెంట్ అయ్యాడు.ఇప్పుడు ప్రభా అదృష్టం ఎలా వుందో? కానీ ఈ సంగతి తెలిసి టాలీవుడ్ జనం కాస్త ఆశ్చర్యపడుతున్నారట. టీవీ సీరియల్స్ అనుభవం వుంది..కానీ ప్రభాకర్ పెద్ద స్క్రీన్ పై సక్సెస్ కాగలడా..అసలు అల్లు అరవింద్ అంత సులువుగా ఎవరికీ అడ్వాన్స్ ఇవ్వరు..అలాంటది ప్రభాకర్ కు ఎలా ఇచ్చాడా అని?