టైటిల్ పెట్టమంటే పూరి తరువాతే. ఇన్నాళ్లు ఆయన పెట్టిందే టైటిల్..తీసిందే సినిమా. తొలిసారి పూరి టైటిల్ మార్చమంటూ వత్తిడి లేదా విన్నపం వచ్చింది. అదే లోఫర్ సినిమాకు సంబంధించి.
వరుణ్ తేజ నటించే సినిమాకు ఆ టైటిల్ వద్దని అన్ని వైపుల నుంచి వచ్చిన సూచనలను పూరి మొత్తానికి పట్టించుకున్నాడు. అందుకే టైటిల్ మారుస్తా అంటూ సూచన ఇచ్చాడు.
అమ్మా నాన్న తమిళ అమ్మాయి తరువాత అమ్మ సెంటిమెంట్ తో రూపొందుతున్న సినిమా ఇది. అందుకే ఈ సినిమాకు ఓ మాంచి టైటిల్ ఆలోచించాడు పూరి అని టాక్.
'మా అమ్మ మహాలక్ష్మి' అన్నది ఆ టైటిల్ అని వినిపిస్తోంది. బహుశా ఒకటి రెండు రోజుల్లో పూరీనే ప్రకటిస్తాడు ఆ సంగతి. ఇంతకీ సినిమాలో అమ్మ మహాలక్ష్మిగా నటిస్తున్నది ఎవరో కాదు, ఒకనాటి హీరోయిన్ రేవతి.