నిజమా..నమ్మగలమా?

దాసరి వేలు పెట్టకుండా దర్శకుడు కథ రెడీ చేసి పవన్ చేత ఓకె చేయించకోవడం.. గబ్బర్ సింగ్ 2 వ్యవహారం ఇలా వుండగానే పవన్ ఆ సినిమాకు ఓకె అనడం జరిగాయన్నది ఇప్పుడు టాలీవుడ్…

దాసరి వేలు పెట్టకుండా దర్శకుడు కథ రెడీ చేసి పవన్ చేత ఓకె చేయించకోవడం.. గబ్బర్ సింగ్ 2 వ్యవహారం ఇలా వుండగానే పవన్ ఆ సినిమాకు ఓకె అనడం జరిగాయన్నది ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న గ్యాసిప్. డాలీ దర్శకుడు. ఎప్పుడో ఒక్క సినిమా చేసాక చివరకు, గోపాల గోపాల చాన్స్ వచ్చింది. 

ఇప్పుడు ముచ్చటగా మూడోది దీని వైనం వార్తలు ఎక్కువ వ్యవహారం తక్కువ అన్నట్లుంది. ఇదిగో దాసరి ఓకె చేసారు. అదిగో పవన్ లైన్ విన్నారు అంటూ తెగ వదంతులు పుట్టిస్తున్నారు. కానీ అసలు సంగతి ఏమిటంటే, సినిమా ఎక్కడి గొంగడి అక్కడే అన్న చందంగా వుందని.  

మరి ఎవరు పుట్టిస్తున్నారు? డాలీ అంటే ఇష్టపడేవారే ఈ వేడి పుట్టిస్తున్నారేమో అని అనుమానం.