మారుతి ‘పాండవుల్లో ఒకడు’

దర్శకుడు మారుతి పాక్షికంగా నిర్మాత. తన సినిమాలను ప్రెజెంట్ చేయడమో, లేదా వేరే వాళ్ల సినిమాలు సమర్పించడమో చేస్తుంటారు. ఇప్పుడు తనే స్వంతంగా సినిమా అందిస్తున్నారు. అయితే నేరుగా కాదు..డబ్బింగ్. వైభవ్ రెడ్డి నటించిన…

దర్శకుడు మారుతి పాక్షికంగా నిర్మాత. తన సినిమాలను ప్రెజెంట్ చేయడమో, లేదా వేరే వాళ్ల సినిమాలు సమర్పించడమో చేస్తుంటారు. ఇప్పుడు తనే స్వంతంగా సినిమా అందిస్తున్నారు. అయితే నేరుగా కాదు..డబ్బింగ్. వైభవ్ రెడ్డి నటించిన తమిళ సినిమా కప్పల్ ఆయనకు బాగా నచ్చేసింది. 

అందుకే హక్కుల కొని డబ్ చేసారు. పూనమ్ బజ్వా ఇందులో కథానాయిక. దిగ్దర్శకుడు శంకర్ దగ్గర పనిచేసిన క్రిష్ ఈ సినిమాకు దర్శకుడు. ప్రేమ పెళ్లిపై కుర్రకారు ఆలోచనలు, ఆ పై అగచాట్లు, ప్రేమ పెళ్లి విడిపోవడం ఇలాంటి నేపథ్యంలో అల్లిన వైవిధ్యమైన కామెడీ కథతో రూపొందించిన సినిమా ఇది. 

తమిళనాట మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వైభవ్ రెడ్డికి సోలో హీరోగా గుర్తింపు ఇచ్చింది. ఇప్పుడు ఈ సినిమాను 'పాండవుల్లో ఒక్కడు'గా తెలుగులో అందిస్తున్నారు. ఈ నెల 20న అడియో ఫంక్షన్ నిర్వహిస్తారు. ఆఖరి వారంలో విడుదల వుండొచ్చు.