ఫీలర్లు వదిలేస్తున్నారు

గ్యాసిప్ అంటే టాలీవుడ్ జనాలకు ఒకప్పుడు మహా మంట..బాలీవుడ్ కల్చర్ అది మనది కాదు అనేవారు. పైగా బాలీవుడ్ జనాలు కావాలని తెలివిగా ఫీలర్లు వదులుతుంటారు. అయితే వెబ్ మ్యాగ్ జైన్స్, రీడర్స్ దాని…

గ్యాసిప్ అంటే టాలీవుడ్ జనాలకు ఒకప్పుడు మహా మంట..బాలీవుడ్ కల్చర్ అది మనది కాదు అనేవారు. పైగా బాలీవుడ్ జనాలు కావాలని తెలివిగా ఫీలర్లు వదులుతుంటారు. అయితే వెబ్ మ్యాగ్ జైన్స్, రీడర్స్ దాని పాపులారిటీ పెరిగాక, ఇప్పుడు కొంతమంది తెలుగు సినిమా జనాలు కూడా ఇదేదోబాగానే వుందే అనే థింకింగ్ లో పడ్డారు. వాళ్లు ఫీలర్లు వెదుక్కుని రాసుకోవడం ఎందుకు మనమే ఇస్తే పోలా..అది కూడా మన సినిమాకు ప్లస్ అయ్యే మాదిరిగా అనే ఆలోచన ఇప్పుడు పెరిగింది.

ఆ మధ్య ఓ సినిమా పెద్దాయిన, తన సినిమా తాలూకు హీరో డ్యాన్స్ విడియోను తానే తనకు తెలిసిన వెబ్ జర్నలిస్ట్ లకు పంపించి, మీకు లీక్ అయినట్లు రాసుకోండి అన్నాడట. ఈ మధ్య విడుదలై మీడియం హిట్ అనిపించుకున్న ఓ సినిమా దర్శకుడు తనను వాళ్లు రమ్మంటున్నారు..వీళ్లు పిలుస్తున్నారు..అంటూ ఫీలర్లు విడుదల చేస్తున్నాడు.

'మేం చెప్పామని రాయకండి..మీకు తెలిసినట్లు రాసుకోండి' అంటూ తెలివిగా ఫీలర్లు వదిలే టాలీవుడ్ జనాల సంఖ్య రాను రాను పెరుగుతోంది. మీడియా జనాలకు న్యూస్ రిక్వెైర్ మెంట్ ఎప్పుడూ వుంటుంది.

దాన్ని ఆసరగా తీసుకుని, తమకు పనికి వచ్చే విధంగా ఫీలర్లు వదిలే విద్యను నేర్చుకున్నారు కొందరు టాలీవుడ్ జనాలు అయితే ఇలా వదలడం కూడా ఒక్కోసారి ఇబ్బందిగా మారుతోంది. ఆ మధ్య ఓ సినిమా డీల్ సెటిల్ దాదాపు అయ్యింది. ఆ ఆనందంలో ఆ నిర్మాత ఎవరో ఒకరికి మెల్లిగా ఫీలర్ వదిలారు. అది కాస్తా వెబ్ మీడియాలోకి వచ్చేసరికి, ఆ సినిమా హీరో కు మండించింది. తానేం చెప్పకుండానే ఇలా చేస్తే ఎలా అని..చేస్తానో లేదో తెలియదు అని రివర్స్ లో వదిలాడు. దాంతో తల పట్టుకుని, మళ్లీ అన్నీ సెట్ చేసుకోవడం నిర్మాత వంతయింది.

ఇలా మొత్తానికి బాలీవుడ్ మాదిరిగా టాలీవుడ్ లో కూడా వెబ్ మీడియాకు సినిమా జనాలే ఫీడింగ్ ఇవ్వడం ప్రారంభమైంది.