టాలీవుడ్ లో ఓ నిర్మాత. ఆయన అడ్వాన్స్ తీసుకోని హీరో, డైరక్టర్ లేరని అంటారు. అయితే ఎంత సులువుగా అడ్వాన్స్ ఇస్తారో, అంతకు అంతా ముక్కుపిండి వసూలు చేస్తారట..తేడా వస్తే. పైగా అలా వసూలు చేసే మొత్తం మళ్లీ ఇలా వుండదట. ఇచ్చిన దానికి డబుల్, త్రిబుల్ కూడా వుంటుందట.
ఇటీవల హిట్ కొట్టిన ఓ దర్శకుడికి, అలాగే సినిమా చేయకుండా అడ్వాన్స్ వెనక్కు ఇచ్చిన ఓ మీడియం హీరోకి ఇది అనుభవమేనంట. అందుకే ఇప్పుడు కొత్తవాళ్లు ఆ నిర్మాత అడ్వాన్స్ ఇస్తా అన్నా, కాస్త ముందు వెనుక ఆడుతున్నారట.
అడ్వాన్స్ ఇవ్వడం, చాలా క్రూషియల్ టైమ్ లో సినిమా చేయమని మెలిక పెట్టడం, చేయడం కుదరకపోతే, అడ్వాన్స్ సెటిల్ మెంట్ పేరిట, భారీ మొత్తాలు తీసుకోవడం పరిపాటి అయిందని టాలీవుడ్ గుసగుసల సారాంశం.