రుద్రమదేవివి..ఆర్థిక ఇబ్బందులేనా?

టాలీవుడ్ లో నిర్మాత కావడం అంత పాపం మరొకటి వుండదు అనిపించేస్తుంది ఒక్కోసారి. కానీ ఒక్కోసారి జాక్ పాట్ కొట్టినట్లే. అందుకే ఆ పాపం భరించడానికి రెడీ అవుతారు చాలా మంది. ఇప్పుడు గుణశేఖర్…

టాలీవుడ్ లో నిర్మాత కావడం అంత పాపం మరొకటి వుండదు అనిపించేస్తుంది ఒక్కోసారి. కానీ ఒక్కోసారి జాక్ పాట్ కొట్టినట్లే. అందుకే ఆ పాపం భరించడానికి రెడీ అవుతారు చాలా మంది. ఇప్పుడు గుణశేఖర్ కు ఈ పాఠం తెలిసివస్తోంది. నిర్మాత ఏ మాత్రం ఇబ్బందుల్లో వున్నాడని తెలిసినా, బయ్యర్లు ఓ ఆట ఆడించేస్తారు. అందులోనూ సినిమా విడుదల గ్యారంటీ కాదు, కాస్త అటు ఇటు అంటే చాలు ఇక వాళ్లు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయరు. కమిట్ అయిన మొత్తాలు కట్టే సూచనలు కనిపించవు. 

అలా అని వాళ్లనీ పూర్తిగా తప్పు పట్టలేం. థియేటర్ల జనాలు వాళ్లతో ఆడేసుకుంటారు మరి. రాజుగారు ఏడుగురు కొడుకులు కథ మాదిరిగా నడుస్తుంది వ్యవహారం. ఆఖరికి ఫైనాన్స్ క్లియరెన్స్ దగ్గరకు వచ్చి ఆగుతుంది. ఇప్పుడు రుద్రమదేవి ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోందని వినికిడి. హిందీ వెర్షన్ తోనూ, అలాగే మరి కొన్ని ఏరియాలు కొన్నవారితోనూ కాస్త తకరారు వచ్చినట్లు వినికిడి. వాళ్లు ముందు కమిట్ అయిన మొత్తాలకు బదులు బేరాలుడుతున్నారో, వెనకాడుతున్నారో మొత్తానికి సమ థింగ్..సమ్ థింగ్ నడుస్తోంది. వీటిని సెట్ చేసుకోవడానికి గుణశేఖర్ కు నిర్మాతగా వున్న అనుభవమూ సరిపోదు..పాపం, ఆయనకు ఇండస్ట్రీలో అంత బ్యాకింగూ లేదు. 

అందుకే కిందా మీదా అయిపోతున్నారు. అందునా రెండు సార్లు వాయిదా పడింది కాబట్టి, బయ్యర్ల నుంచి ఫైనల్ పేమెంట్ లు అంత సులువుగా రావు. అవి వస్తే కానీ ఫైనాన్షియర్లు క్లియరెన్స్ ఇవ్వరు. ఈ రెండు లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ పెడుతూనే వుంటాయి. పైగా రుద్రమదేవి రాకుంటే బెటర్ అనుకునే వాళ్లు వుండనే వుంటారు. ఎక్కడో ఒక్క దగ్గర చిక్కు ముడి బిగుస్తూనే వుంటారు.