అనగనగా ఓ స్క్రిప్ట్ కథ

ఆయనో పెద్ద దర్శకుడు..మంచి రచయిత కూడా. సరైన హిట్ లేక కిందా మీదా అవుతున్న సమయంలో ఓ అప్ కమింగ్ కుర్రాడితో సినిమా ఆఫర్ వచ్చింది. లైన్ చెప్పారు..గ్రీన్ సిగ్నల్ వచ్చింది. స్క్రిప్ట్ తెస్తే,…

ఆయనో పెద్ద దర్శకుడు..మంచి రచయిత కూడా. సరైన హిట్ లేక కిందా మీదా అవుతున్న సమయంలో ఓ అప్ కమింగ్ కుర్రాడితో సినిమా ఆఫర్ వచ్చింది. లైన్ చెప్పారు..గ్రీన్ సిగ్నల్ వచ్చింది. స్క్రిప్ట్ తెస్తే, విని, చదివి, ఒకె చేద్దాం అన్నారు. అదిగో అక్కడ పడింది లాక్. వన్ వీక్ టైమ్ అడిగారు. వన్ మోర్ వీక్ అన్నారు..వన్స్ మోర్ అన్నారు.

విషయం ఏమిటంటే..ఈ కుర్రాడు సిసింద్రీ. యాక్షన్ లోనే కాదు, స్క్రిప్ట్ ల విషయంలో కూడా కాస్తో కూస్తో టాలెంట్ వుంది. అందువల్ల మనం పట్టుకెళ్లిన స్క్రిప్ట్ ను..విని..అబ్బే అని అనేస్తే..ప్రాజెక్టు ఎక్కడ దూరం అయిపోతుందో అని భయం.

పోనీ పకడ్బందీ స్క్రిప్ట్ తయారుచేసి ఇద్దామంటే..ఇన్నాళ్లు పాయింట్ పట్టుకుని, సెట్ మీదకు వెళ్లిపోయి, ఏ రోజు కు ఆరోజు డైలాగు వెర్షన్ రాయించుకుంటూ కానిచ్చేయడం అలవాటు. అందువల్ల ఇప్పుడు చక్కగా స్క్రిప్ట్ తయారు చేయాలని కిందా మీదా అవుతున్నారట ఆ డైరక్టర్.

సరే, ఎప్పుడు స్క్రిప్ట్ తెస్తే అప్పుడే తెస్తారు..మనకేం పోయే..నచ్చితే చేస్తాం..లేదంటే లేదు..అని సైలెంట్ గా వున్నాడు హీరో.