కరోనా సోకిన వాళ్లలో కొత్త సమస్య

కరోనా లక్షణాల్ని ఇప్పటికే కనిబెట్టారు సైంటిస్టులు. మరి కరోనా వచ్చి తగ్గిన తర్వాత వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు బయటపడుతున్నాయి? దీనికి సంబంధించి దశలవారీగా లక్షణాలు బయటపడుతూనే ఉన్నాయి. కీళ్ల నొప్పులు, నీరసం కామన్ సమస్యలు…

కరోనా లక్షణాల్ని ఇప్పటికే కనిబెట్టారు సైంటిస్టులు. మరి కరోనా వచ్చి తగ్గిన తర్వాత వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు బయటపడుతున్నాయి? దీనికి సంబంధించి దశలవారీగా లక్షణాలు బయటపడుతూనే ఉన్నాయి. కీళ్ల నొప్పులు, నీరసం కామన్ సమస్యలు కాగా.. మహిళల్లో ఇప్పుడో కొత్త సమస్య పుట్టుకొచ్చింది. అదే హెయిర్ లాస్.

అవును.. కరోనా వచ్చి తగ్గిన తర్వాత చాలామంది మహిళలు తమ జుట్టు రాలడాన్ని గమనించారు. కరోనా నుంచి కోలుకున్న 6 నెలలకు నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడింది. ఈ మేరకు ''ది లాన్సెట్'' అనే స్టడీ అనేక విషయాల్ని బయటపెట్టింది.

కరోనా సోకి కోలుకున్న మహిళల్లో, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన 6 నెలల్లో గణనీయంగా జుట్టు రాలడాన్ని గమనించారు నిపుణులు. ఈ మేరకు చైనాలోని వూహాన్ లో కరోనా నుంచి రికవర్ అయిన 1655 మంది మహిళలపై పరిశోధన చేయగా.. అందులో 359 మంది తమకు జుట్టు అధికంగా రాలుతుందనే విషయాన్ని బయటపెట్టారు. దీంతో కరోనా 'ఆఫ్టర్ సైడ్ ఎఫెక్ట్స్' జాబితాలో దీన్ని కూడా చేర్చారు.

కరోనా నుంచి కోలుకున్న 6 నెలల్లో మహిళల్లో జుట్టురాలే సమస్యతో పాటు నిద్రలేమి, గాభరా, మానసిక ఒత్తిడి లాంటి సమస్యల్ని కూడా ఈ స్టడీ గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా పురుషులు ఎక్కువగా కరోనా బారిన పడ్డారు. కానీ కోలుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది.

చంద్రబాబు మెదడును విజయవాడ మ్యూజియంలో పెట్టాలి

నా సినిమాల బడ్జెట్స్ అందుకే పెరుగుతాయి