ప్రేమ్ రక్షిత్ చూపు రెజీనా వైపు

ప్రేమ్ రక్షిత్ అనగానే యంగ్ హీరోలు వేసిన అతి క్లిష్టమైన స్టెప్స్ గుర్తుకు వస్తాయి. ఇప్పుడు ఆయన లారెన్స్, ప్రభుదేవా మాదిరిగా మెగాఫోన్ పట్టబోతున్నారు. ఈ సంగతి ఇంతకు ముందే వెల్లడించాం. సురేష్ సంస్థ…

ప్రేమ్ రక్షిత్ అనగానే యంగ్ హీరోలు వేసిన అతి క్లిష్టమైన స్టెప్స్ గుర్తుకు వస్తాయి. ఇప్పుడు ఆయన లారెన్స్, ప్రభుదేవా మాదిరిగా మెగాఫోన్ పట్టబోతున్నారు. ఈ సంగతి ఇంతకు ముందే వెల్లడించాం. సురేష్ సంస్థ కోసం ఆయన స్క్రిప్ట్ వర్క్ చేయడంలో బిజీగా వున్నారు. రానా హీరోగా నటించే ఈ సినిమా సెట్ మీదకు వెళ్లడానికి ఇంకా టైమ్ పడుతుంది.

అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లేటెస్ట్ బజ్ ఏమిటంటే..హీరోయిన్ గా రెజీనాను ఎంపిక చేసారని. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో రెజీనా అన్ని విధాలా మంచి పెర్ ఫార్మెన్స్ కనబర్చడం, మాంచి డ్యాన్స్ మూమెంట్స్ చూపించడం నచ్చి, ప్రేమ్ రక్షిత్ ఆమెను ఫైనల్ చేసాడట. దీనికి సురేష్, రానా కూడా ఒకె అన్నారట.

రెజీనా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతోంది. ఇక త్వరలో రకుల్ మాదిరగా టాప్ హీరోల సరసకు వెళ్లిపోతుందేమో?