మెగాముచ్చట మూడు నిమషాలే

ఈ వార్త మెగాభిమానులకు కాస్త డిస్సపాయింట్ మెంట్ గా వుంటుంది. అయితే సినిమా విడుదలయ్యాక అలా వుండే కన్నా, ముందుగా చెప్పేయడం మంచిదని భావిస్తోంది బ్రూస్ లీ యూనిట్. విషయం ఏమిటంటే..మెగాస్టార్ చిరంజీవి బ్రూస్…

ఈ వార్త మెగాభిమానులకు కాస్త డిస్సపాయింట్ మెంట్ గా వుంటుంది. అయితే సినిమా విడుదలయ్యాక అలా వుండే కన్నా, ముందుగా చెప్పేయడం మంచిదని భావిస్తోంది బ్రూస్ లీ యూనిట్. విషయం ఏమిటంటే..మెగాస్టార్ చిరంజీవి బ్రూస్ లీ సినిమాలో కనిపిస్తారని ముందుగానే లీక్ అయింది. 

ముందు కేవలం ఫైట్ అన్నారు. తరువాత కాసిన్ని సీన్లు అన్నారు. ఆపైన పాట అన్నారు. కానీ ఇవన్నీ వదంతులే అని తరువాత తేల్చారు. ఆఖరికి సీన్లు, ఫైటు ఖాయం అన్నారు. ఈ రోజు షూటింగ్ ప్రారంభమయింది. అయితే విషయం ఏమిటంటే..బ్రూస్ లీ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కేవలం మూడు నిమషాలు మాత్రమే కనిపిస్తారు. అది కూడా ఓ ఫైట్ లో. అంతకు మించి ఏమీ వుండదు. వుందని అనుకోవద్దు అన్నది యూనిట్ మెగాభిమానులకు చెబుతున్నమాట.