ఒక్క మహేష్ ఎంతమందికి చాన్సిస్తాడు

మహేష్ కోసం కథ, స్క్రిప్టు రెడీ అంటున్నాడు పూరి జగన్నాథ్. అ..ఆ తరువాత త్రివిక్రమ్ సినిమా మహేష్ తోనే వుంటుంది అని టాక్. మురగదాస్ లైన్ చెప్పాడు..మహేష్ ఓకె చేసాడు అని వార్త. శేఖర్…

మహేష్ కోసం కథ, స్క్రిప్టు రెడీ అంటున్నాడు పూరి జగన్నాథ్. అ..ఆ తరువాత త్రివిక్రమ్ సినిమా మహేష్ తోనే వుంటుంది అని టాక్. మురగదాస్ లైన్ చెప్పాడు..మహేష్ ఓకె చేసాడు అని వార్త. శేఖర్ కమ్ముల తరచు మహేష్ ను కలుస్తున్నాడు..సినిమా ఇస్తామని హామీ ఇచ్చాడు మహేష్ అని హడావుడి.

లింగుస్వామి ఎన్నాళ్ల నుంచో మహేష్ కు కథ చెప్పాలని ప్రయత్నాలు. చాన్స్ ఇస్తే మహేష్ తో మాంచి మాస్ సినిమా చేయాలనుంది అని టాలీవుడ్ ఫ్రెండ్స్ తో కోలివుడ్ దర్శకుడు హరి అన్నాడని బోగట్టా. వివి వినాయక్ తో సినిమా వుంటుంది అని మహేష్ నే ప్రకటించాడు. ఎప్పటికైనా మహేష్ తో సినిమా చేస్తాను అంటాడు రాజమౌళి. 

ఇప్పటికే జాబితాలో నెంబర్ల సంఖ్య పదికి చేరిపోయింది. వీటిలో మూడు నాలుగు వదిలేసినా, వినాయక్, త్రివిక్రమ్, మురగదాస్, రాజమౌళి,పూరి సినిమాలు అయితే మెటీరియలైజ్ అయ్యే అవకాశం వుంది. ఇవి పూర్తి కావడానికే మూడేళ్లు పట్టడం గ్యారంటీ. అంటే ఇంకెవరైనా కొత్త కథతోనో, మంచి పాయింట్ తోనో మహేష్ దగ్గరకు వస్తే, ఎన్నాళ్లు వెయిట్ చేయాల్సి వుంటుందో?