నాగార్జున బాహుబలి హక్కులు కొన్నాడు..అదీ చిత్తూరు జిల్లాకు. ఇదీ నెట్ లో అక్కడా అక్కడా తాజగా కనిపించిన గ్యాసిప్. ఇది విని బాహుబలికి సంబంధించిన జనాలు భలే జోక్ అనుకుంటున్నారు.
నాగ్ ఏమిటి..బాహుబలి ఓ జిల్లాకు కొనడం ఏమిటి? అని. నాగ్ కు డిస్ట్రిబ్యూషన్ వుంది కానీ, అది విశాఖకే. పైగా ఇప్పుడు ఆయన సినిమాల్లో బిజీగా వున్నారు. ఇతర వ్యవహారాల్లో వేలు పెట్టడం లేదు. అందువల్ల నాగ్ కొనడం కరెక్ట్ కాదని స్పష్టంగా తెలిసింది.
పైగా సీడెడ్ ఏరియా అంతా రాజమౌళికి సన్నిహితుడు సాయి కొర్రపాటికే వుండాలి లెక్క ప్రకారం. అయితే, వేరే లెక్కల రీత్యా ఎన్ వి ప్రసాద్ పేరిటనే వుందని తెలుస్తోంది. మరి వాళ్లు మళ్లీ పీస్ మీల్ రేటున ఎందుకు అమ్ముతారు..అసలు లాజిక్ అదీ.