ఆన్ లైన్ లో బాహుబలి అమ్మకాలు?

బాహుబలి కోసం రాజమౌళి ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. ఆ సినిమాకు వచ్చిన హైప్ ను క్యాష్ చేసుకోవడంలో ఎన్ని మార్గాలు వున్నాయో, అన్ని మార్గాలు వాడేస్తున్నాడు. ఆఖరికి డిజిటల్ కంటెంట్ కూడా బాహుబలి…

బాహుబలి కోసం రాజమౌళి ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. ఆ సినిమాకు వచ్చిన హైప్ ను క్యాష్ చేసుకోవడంలో ఎన్ని మార్గాలు వున్నాయో, అన్ని మార్గాలు వాడేస్తున్నాడు. ఆఖరికి డిజిటల్ కంటెంట్ కూడా బాహుబలి పేరిట పెట్టిన సంస్థే చూసుకుంటోంది తప్ప బయటవారికి ఇవ్వలేదు. 

ఇప్పుడు ఆన్ లైన్ లో బాహబలి రెప్లికాలు అమ్మాలని ఆలోచిస్తున్నారట. బాహుబలిలో వాడిన ఆయుధాల నమూనాలు, ప్రభాస్, రానా, తమన్నాల పోస్టర్లు, టీ షర్ట్ లు, కీ చెయిన్ లు ఇలాంటివి అన్నీ ఆన్ లైన్ స్టోర్ లో అమ్మకాలు సాగిస్తే ఎలా వుంటుంది అని ఆలోచిస్తున్నారట. 

రెండు వందల కోట్ల ఆదాయం ఎలాగైనా రాబట్టాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నపుడు, దొరికిన మార్గం దేనినీ వదలకపోవడం మంచిదేగా?