ఛార్మి మ‌న‌సులో దేవిశ్రీ‌

ఛార్మికీ దేవిశ్రీ ప్రసాద్‌కీ మ‌ధ్య ఏముందో తెలీదుగానీ… వీళ్లిద్దరిపై చాలా ర‌కాల వార్తలు గుప్పుమ‌నేవి. ఛార్మి కూడా వాటిపై ఓపిగ్గా స‌మాధానాలిచ్చేది. ఇప్పటికీ దేవిశ్రీ పేరు చెప్పగానే.. ఛార్మి మొహం పిట్రమాక్సులైటులా వెలిగిపోతుంది. `చెప్తిందే…

ఛార్మికీ దేవిశ్రీ ప్రసాద్‌కీ మ‌ధ్య ఏముందో తెలీదుగానీ… వీళ్లిద్దరిపై చాలా ర‌కాల వార్తలు గుప్పుమ‌నేవి. ఛార్మి కూడా వాటిపై ఓపిగ్గా స‌మాధానాలిచ్చేది. ఇప్పటికీ దేవిశ్రీ పేరు చెప్పగానే.. ఛార్మి మొహం పిట్రమాక్సులైటులా వెలిగిపోతుంది. `చెప్తిందే ఏం చెప్తాం` అనుకోకుండా దేవిశ్రీ గురించి అన‌ర్గళంగా మాట్లాడుతుంటుంది.

ప్రస్తుతం జ్యోతిల‌క్ష్మికి సంబంధించి మీడియాతో కాస్త ఘ‌ట్టిగానే ట‌చ్‌లో ఉంటోంది ఛార్మి. ప్రతి ఒక్కరూ దేవిశ్రీ గురించి అడిగేవాళ్లే. ఛార్మి కూడా ఓపిగ్గానే త‌మ మ‌ధ్య బంధం గురించి పూస గుచ్చిన‌ట్టు చెబుతోంది. దేవిశ్రీ త‌న‌కు మంచి మిత్రుడ‌ని, తాను ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ఆదుకొన్నాడ‌ని, త‌మ మ‌ధ్య ఏముందో ఇంట్లో వాళ్లకీ తెలుస‌ని చెప్పుకొచ్చింది ఛార్మి. 

త‌న త‌ల్లిదండ్రుల‌కీ దేవిశ్రీ అంటే మంచి అభిప్రాయ‌మే ఉందంటోంది. అయితే త‌మ‌ది ప్రేమో ఏమో అన్నది సంగ‌తి మాత్రం బ‌య‌ట‌పెట్టలేదు ఛార్మి. ప్రేమ గురించి అడిగితే మాత్రం.. ప్రస్తుతం జ్యోతిల‌క్ష్మి పాత్రని పిచ్చపిచ్చగా ప్రేమిస్తున్నాని జోకేసింది. అవును మ‌రి.. స‌హ నిర్మాత‌గా ఈ సినిమాతో బాధ్యత‌ల్ని నెత్తిన పెట్టుకొంది క‌దా, ఆ మాత్రం ప్రేమించాలి.