యూ ట్యూబ్ లో ట్రయిలర్ ను బ్లాక్ చేయడంతో బాహుబలి టీమ్ నానా అగచాట్లు పడింది. ఆఘమేఘాల మీద కిందా మీదా పడి, గూగుల్ తో సంప్రదించి, దాన్ని రిస్టోర్ చేయించగలిగారు. అయితే ఎవరు చేసారో, ఎందుకు చేసారో తెలియదు కానీ, చాలా మంది ఈ ట్రయిలర్ విడియోను స్పామ్ గా రిపోర్టు చేసారని వినికిడి.
Advertisement
చాలా ఎక్కువ స్పామ్ రిపోర్టులు రావడంతో గూగుల్ ఆ విడియోను పక్కన పెట్టింది. ఇది స్పామ్ కాదని, ప్రెస్జీజియస్ సినిమా ట్రయిలర్ అని వర్తమానాలు ఇచ్చి, కిందా మీదా పడి బాన్ తొలగింపచేసారు. ఎవరో అత్యుంత్సాహంతో చేసిన పని కి ఇంతపని పట్టింది.