ప్రగతి హనుమంతరావు కన్నుమూత

ప్రింటింగ్ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పి, అవార్డులు సాధించిన ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు మరణించారు. ఆయన 1962లో ప్రగతి ప్రింటర్స్ ను చిన్న ప్రెస్ గా స్థాపించారు. ఇవ్వాళ రాష్ట్రంలోనే కాదు,…

ప్రింటింగ్ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పి, అవార్డులు సాధించిన ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు మరణించారు. ఆయన 1962లో ప్రగతి ప్రింటర్స్ ను చిన్న ప్రెస్ గా స్థాపించారు. ఇవ్వాళ రాష్ట్రంలోనే కాదు, దేశంలో, అంతర్జాతీయంగా ఆధునిక సాంకేతిక సంపత్తి వున్న ప్రెస్ ల్లో ఒకటిగా వుంది. 

ప్రగతి ప్రింటర్స్ సంస్థ ఏటా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు గెల్చుకోవడం అన్నది పరిపాటి. హనుమంతరావుకు కమ్యూనిస్టు పార్టీతో మంచి సంబంధాలు వున్నాయి. ఆయన పార్టీలో పని చేసారు. ఇప్పటికీ చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ చైర్మన్ గా వున్నారు. అనేక మంది రచయితలకు వారి రచనలు ప్రచురించడానికి తన ప్రెస్ ద్వారా ఆయన చాలా సహకారం అందించేవారు. 

తొలి రోజుల్లో అంటే 1960ల కాలంలో ఆయన విశాలాంధ్ర జర్నలిస్టుగా, సారథి స్టూడియో మేనేజర్ గా పనిచేసారు. ప్రస్తుతం ఆయన కుమారుడు నరేంద్ర ప్రెస్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.