కొరటాల ‘మైత్రి’ వదలడం లేదుగా

ఓవర్ సీస్ మార్కెట్ అనుభవంతో టాలీవుడ్ లోకి వచ్చారు మైత్రీ మూవీస్ నిర్మాతలు. టాప్ టాలీవుడ్ పీపుల్ అందరికీ అడ్వాన్స్ లు ఇచ్చారు. అయితే కొరటాల శివ-మహేష్ తో కలిసి శ్రీమంతుడు అంటూ తొలి…

ఓవర్ సీస్ మార్కెట్ అనుభవంతో టాలీవుడ్ లోకి వచ్చారు మైత్రీ మూవీస్ నిర్మాతలు. టాప్ టాలీవుడ్ పీపుల్ అందరికీ అడ్వాన్స్ లు ఇచ్చారు. అయితే కొరటాల శివ-మహేష్ తో కలిసి శ్రీమంతుడు అంటూ తొలి బోణీ కొట్టారు. అంతే వారికి ఇప్పుడు కొరటాల శివ వర్కింగ్ స్టయిల్ మీద, స్టామినా మీద అపారనమ్మకం కుదిరిపోయింది. 

పైగా తమ తరువాతి సినిమాకు హీరోగా ఎంచుకున్న ఎన్టీఆర్ కావచ్చు, తాము అడ్వాన్స్ లు ఇచ్చిన పవన్ తదితరులు కావచ్చు..అంతా కూడా కొరటాల అంటే వెంటనే సై అనేస్తున్నారు. దీంతో మైత్రీ మూవీస్ జనాలు కొరటాల శివను వదిలకుండా పట్టుకున్నారు. 

అఖిల్ తన రెండోసినిమాను కొరటాల శివతో చేసేందుకు ఆసక్తిగానే వున్నాడు. కొరటాల దగ్గర అడ్వాన్స్ వున్న నిర్మాత బండ్ల గణేష్ రెడీగానే వున్నాడు. ఈ కాంబినేషన్ కొరటాలకు ఆసక్తిగానే వుంది. కానీ మైత్రీ మూవీస్ వాళ్లు మాత్రం..మన మైత్రీ బంధం వీడనిదీ..మనం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాం..అంతే..అని ఆల్ మోస్ట్ ఓకె అనిపించేసారట. అదీ సంగతి.