‘అఖిల్’ కథ అల్లేస్తున్నారు

టాలీవుడ్ లో జనాలు మాంచి హుషారుగా వుంటారు. అదిగో టైటిల్ అంటే ఇదిగో టైటిల్ అంటూ కబుర్లు చెప్పేస్తుంటారు. వాటిల్లో కొన్ని నిజాలుంటాయి..నిజమవుతుంటాయి..కొన్ని తుస్సుమంటాయి. ఇప్పుడు తాజాగా, అఖిల్ సినిమా కథ అంటూ కొన్ని…

టాలీవుడ్ లో జనాలు మాంచి హుషారుగా వుంటారు. అదిగో టైటిల్ అంటే ఇదిగో టైటిల్ అంటూ కబుర్లు చెప్పేస్తుంటారు. వాటిల్లో కొన్ని నిజాలుంటాయి..నిజమవుతుంటాయి..కొన్ని తుస్సుమంటాయి. ఇప్పుడు తాజాగా, అఖిల్ సినిమా కథ అంటూ కొన్ని సంగతులు చక్కర్లు కొడుతున్నాయి. అదెంతవరకు నిజం అన్నది తెలియదు కానీ, కథ మాత్రం కాస్త ఆసక్తికరంగానే వుంది. 

హీరో..విదేశాల్లో గైడ్..లేదా సమ్ థింగ్..హీరోయిన్ విదేశాలకు చదువుకోసం వెళ్తుంది..అక్కడ లింక్ కలుస్తుంది.ప్రేమ..కట్ చేస్తే, హీరోయిన్ కిడ్నాప్.. హీరోయిన్ కోసం హీరో వెదుకులాట..సీన్ ఎక్కడో మారుమూల ప్రాంతానికి షిప్ట్. అక్కడ వేరే కథ..ఓ బంతి..దానికి సూర్యుడికి ఏదో లింక్..దాన్ని ఏదో చేస్తే ఊరికి మంచింది..అది ఫలానా లక్షణాలు వున్నవాడే చేయాలి. అదే లక్షణాలు వున్నవాడి ద్వారా ఆ బంతిని సేకరిస్తే అన్నది విలన్ ట్రాక్..ఇలా సాగుతుంది కథ అని అల్లుతున్నారు. 

మరి కొందరు ముందుకెళ్లి..హీరోయిన్ ద్వారా హీరో ను ఊళ్లోకి రప్పించడం అంటే మళ్లీ కిక్ 2 టైపు లైన్ కలిపారా అని కహానీలు చెబుతున్నారు. మొత్తానికి అఖిల్ సినిమా కోసం అల్లిన ఫాంటసీ కథ పై ఊహాగానాలు బాగానే సాగుతున్నాయి.