పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. చాన్నాళ్ల తరువాత లెగ్ షేక్ చేయబోతున్నాడు. గబ్బర్ సింగ్ 2 సినిమా కోసం నానక్ రామ్ గూడాలో వేసిన సెట్ లో, లక్ష్మీ రాయ్ తో కలిసి డ్యాన్స్ చేయబోతున్నాడు. ఈ షూటింగ్ ఈ నెల 30న ప్రారంభం కాబోతోంది. ఒక పక్క దర్శకుడు బాబితో పవన్ సంతృప్తిగా లేరని వదంతులు వినిపిస్తుండం నిర్మాత శరద్ మురార్, నేరుగా పవన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
ఆయన అవేవీ పట్టించుకోవద్దని, అస్సలు గబ్బర్ సింగ్ 2 కు సంబంధించిన వ్యవహారాలు బయట ఎలా వినిపించినా, ఖండించడం కానీ, పట్టించుకోవడం కానీ ఎవరూ వ్యక్తిగతంగా చేయవద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఏం చెప్పాలనుకున్నా, త్రూ పీఆర్వో ద్వారానే చెప్పాలని, అలా అని ప్రతి గ్యాసిప్ కు సమాధానం అవసరం లేదని పవన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.