మ‌హేష్‌తో ప్రణీత‌?

అత్తారింటికి దారేది లాంటి బ్లక్‌బస్టర్ హిట్‌ని క్యాష్ చేసుకోలేక‌పోయింది ప్రణీత‌. ఆ త‌ర‌వాత‌ రెండు మూడు సినిమాలు చేసినా పెద్దగా పేరు తీసుకురాలేదు. ఇప్పుడు మంచు విష్ణుతో డైన‌మేట్ లో న‌టిస్తోంది. ఈలోగా మ‌రో…

అత్తారింటికి దారేది లాంటి బ్లక్‌బస్టర్ హిట్‌ని క్యాష్ చేసుకోలేక‌పోయింది ప్రణీత‌. ఆ త‌ర‌వాత‌ రెండు మూడు సినిమాలు చేసినా పెద్దగా పేరు తీసుకురాలేదు. ఇప్పుడు మంచు విష్ణుతో డైన‌మేట్ లో న‌టిస్తోంది. ఈలోగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ అందుకొన్నట్టు టాలీవుడ్ టాక్‌. ప్రణీత త్వర‌లోనే మ‌హేష్‌తో న‌టించే ఛాన్స్ కొట్టేసిందట‌.

మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా బ్రహ్సోత్సవం ప‌ట్టాలెక్కింది. జూలైలో షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంది. ఓ క‌థానాయిక‌గా ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌ని ఎంచుకొంది చిత్రబృందం. ఈ సినిమాలో మ‌రో నాయిక‌కీ ఛాన్స్ ఉంద‌ట‌. ఆ అవ‌కాశం ప్రణీత‌కు ద‌క్కింద‌ని తెలుస్తోంది. 

ఈ అవ‌కాశాన్ని గ‌నుక అందిపుచ్చుకొంటే.. టాప్ క‌థానాయిక‌ల లిస్టులో ప్రణీత పేరు చేరిపోవ‌డం ఖాయం