ఒక్క పూరి జగన్నాథ్‌ని మినహాయించి చూస్తే బడా దర్శకులంతా వర్కింగ్ డేస్ ఎక్కువ తీసుకొనేవాళ్లే. యేడాదికి ఒక్క సినిమా వచ్చినా చాలనుకొంటారు. శ్రీనువైట్ల కూడా అదే టైపు. తన సినిమాల్లో స్పీడు ఉంటుంది గానీ – టేకింగ్‌లో కాదు. కాస్త నిదానంగానే సినిమాని తీస్తారాయన. అయితే రామ్‌చరణ్ సినిమా మాత్రం స్పీడు స్పీడుగా లాగించేయాలన్న ఉద్దేశంలో ఉన్నారు. అక్టోబరు 15న ఈ సినిమాని విడుదల చేయాలన్నది లక్ష్యం.
అయితే ఇప్పటికి 30 శాతం షూటింగ్ కూడా పూర్తవ్వలేదు. మేజర్ షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది. అది ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. నాలుగు నెలల్లో సినిమా పూర్తి చేసి, చెప్పిన సమయానికి విడుదల చేయడం కష్టమే. అయితే అసాధ్యంకాదు. కానీ.. శ్రీనువైట్ల గురించి తెలిసిన వాళ్లెవరైనా… ఇంత స్పీడుగా సినిమా లాగించేడయం కష్టమే అంటున్నారు.
కానీ శ్రీను మాత్రం కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. అక్టోబరు 15 నాటికి సినిమా రిలీజ్ చేయడం ఖాయంటున్నాడు. ఆగడుతో పోయిన ఇమేజ్‌ని తిరిగి వీలైనంత త్వరగా దక్కించుకోవాలన్నది శ్రీనువైట్ల ప్రయత్నం. అందుకే.. తన వేగం కూడా పెంచుతూ ఈ సినిమాని పూర్తి చేయాలన్న తపనతో ఉన్నాడట.