వీరూ… ఎంత‌కాలం వెయిటింగూ..?

వీరూపోట్ల‌.. బిందాస్‌తో ద‌ర్శకుడిగా మారిన ర‌చ‌యిత‌. ఆ త‌ర‌వాత ర‌గ‌డ చేశాడు. అదీ ఓ మాదిరిగా ఆడింది. అప్పటి నుంచి మ‌రో ఛాన్స్ కోసం సుదీర్ఘంగా నిరీక్షిస్తున్నాడు. మ‌ధ్యలో ర‌వితేజ‌, వెంక‌టేష్‌ల కోసం ఓ…

వీరూపోట్ల‌.. బిందాస్‌తో ద‌ర్శకుడిగా మారిన ర‌చ‌యిత‌. ఆ త‌ర‌వాత ర‌గ‌డ చేశాడు. అదీ ఓ మాదిరిగా ఆడింది. అప్పటి నుంచి మ‌రో ఛాన్స్ కోసం సుదీర్ఘంగా నిరీక్షిస్తున్నాడు. మ‌ధ్యలో ర‌వితేజ‌, వెంక‌టేష్‌ల కోసం ఓ క‌థ రెడీ చేశాడు. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ మ‌నోజ్ ద‌గ్గర‌కు వెళ్లాడు. ఇప్పుడు గోపీచంద్‌తో సినిమా చేస్తున్నాడంటూ వార్తలొస్తున్నాయి. 

అయితే… 'ఆ వార్తలేం నిజం కాదు' అని కొట్టిపారేశాడు వీరూపోట్ల‌. నిజానికి ర‌గ‌డ త‌ర‌వాత వీరూ – గోపీచంద్ కాంబినేష‌న్‌లో ఓ  సినిమా రావాల్సింది. కొంత‌కాలం గోపీచంద్ వెనుక క‌థ‌ప‌ట్టుకొని తిరిగాడు వీరూ. కానీ కుద‌ర్లేదు. 

మొన్నామ‌ధ్య గోపీ నుంచి పిలుపు వ‌చ్చిన మాటా నిజ‌మే. కాక‌పోతే… క‌థ‌పై గోపీచంద్ పూర్తి సంతృప్తి వెలుబుచ్చక‌పోవ‌డంతో ఆయ‌నా 'నో' అనేశాడు. మ‌రి వీరూపోట్లకు మ‌లి సినిమా అవ‌కాశం ఎవ‌రిస్తారో, అది ఎప్పుడు ద‌క్కుతుందో?