పూరి సినిమా హార్డ్ అటాక్ తో ఫీల్డ్ లోకి వచ్చింది. కానీ ఆ తరువాత ఆమెకు దొరకుతున్న క్యారెక్టర్లు చూస్తుంటే, అయ్యో పాపం అనిపిస్తోంది. సన్నాఫ్ సత్యమూర్తిలో తండ్రి చాటు కూతురిగా చిన్న పాత్ర. బస్..అంతే. ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో మరీ దిగదుడుపు. ఒక విధంగా సెకెండ్ హీరోయిన్ టైపు పాత్ర.
కావాలనుకుంటే, హీరోతో ఓ సాంగ్ కూడా వుంచుకోవచ్చు. కానీ అదేం చేయలేదు. పైగా ఆమెను మోసం చేసే కుర్రాడి పాత్రకయినా ఓ రేంజ్ నటుడిని పెట్టవచ్చుగా. ఏ రాహుల్ రవీంద్రన్ లాంటి వాడినో ఒప్పించవచ్చుగా. కానీ గట్టిగా పేరు కూడా తెలియని చిన్న కమెడియన్ ను తెచ్చి, జోడీగా పెట్టడం అంటే..దారుణమేగా..పైగా ఆదాశర్మ లాంటి అమ్మాయి..వాడేదో అందగాడు అన్నట్లు అలా చూస్తూ వుండిపోవడం..వాడి మాయలో పడిపోవడం భలే ఫన్నీగా వుంది.
ఫన్నీగా వున్నది సీక్వెన్స్ మాత్రమే కాదు..ఆదా శర్మ కు పడుతున్న క్యారెక్టర్లు కూడా.