బాహుబలి – రుద్రమదేవి ఈ రెండు సినిమాలు టాక్ ఆఫ్ ది ఇంటస్ట్రీ. మరీ వంద కోట్లకు పైగా బడ్జెట్ కాకున్నా, కూడా భారీ సినిమానే. సాంకేతిక హంగులన్నింటితో గుణశేఖర్ ఈ సినిమాని రెండేళ్ల నుంచి ఓ శిల్పంగా చెక్కుతున్నాడు. పైగా త్రీడీ సినిమా. బాహుబలి కంటే.. ముందే తన సినిమాని విడుదల చేయాలని అనుకున్నాడు. అందుకు తగిన ఏర్పాట్లూ చేసుకొన్నాడు. ఆడియో ఫంక్షన్లు చేసేసాడు. కానీ అక్కడితో సరి. ఇక సినిమా గురించే ఊసెత్తడం లేదు
. బాహుబలి తరవాత రుద్రమదేవి విడుదల చేస్తే… పోలికలు ఎక్కువైపోయి రుద్రమదేవి తేలిపోయే ఛాన్సుంది. ఆ అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే బాహుబలి కంటే ముందే రుద్రమదేవి ని విడుదల చేయాలి. అయితే అందుకు తగిన ఆర్థిక వనరులు గుణశేఖర్ దగ్గర లేవు. ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోవడం వల్ల.. ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఏదీ ఇవ్వలేకపోతున్నాడు గుణశేఖర్.
ఈరోజ గుణశేఖర్ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొనైనా ఒక్క టీజరూ బయటకు విడుదల చేయలేదు. బాహుబలిని జులై 10న విడుదల చేద్దామనుకొంటున్నారు. ఇప్పటికీ బాహుబలి కంటే ముందే రుద్రమను విడుదల చేసే ఛాన్సుంది. ప్రస్తుతం గుణ కూడా ప్రయత్నాల్లోనే ఉన్నట్టు టాక్. ఆ అడ్డంకులన్నీ ఎప్పుడు తొలగిపోతాయో.. రుద్రమని ఎప్పుడు చూపిస్తాడో!