కోన శంకరాభరణం కొన్ని నిజాలు

కోనవెంకట్ కు మీడియా సంబంధాలు బాగా వుంటాయని, ఆయనే కోరి ఫీలర్లు ఇచ్చి గ్యాసిప్ లు రాయిస్తారని టాలీవుడ్ టాక్. ఆయనే కోరి వార్తలు పుట్టిస్తుంటారని అంటారు. కొన్ని సార్లు తన సినిమాను వార్తల్లో…

కోనవెంకట్ కు మీడియా సంబంధాలు బాగా వుంటాయని, ఆయనే కోరి ఫీలర్లు ఇచ్చి గ్యాసిప్ లు రాయిస్తారని టాలీవుడ్ టాక్. ఆయనే కోరి వార్తలు పుట్టిస్తుంటారని అంటారు. కొన్ని సార్లు తన సినిమాను వార్తల్లో నాన్చడం కోసం ఫీలర్లు వదుల్తుంటారని అంటారు.  అలాంటి కోన వెంకట్ ఇప్పుడు నిఖిల్ తో చేయబోయే సినిమా శంకరాభరణం. 

ఈ సినిమా పై గ్యాసిప్ లు ప్రారంభమయ్యాయి. కోన వెంకట్ నిజజీవితంలోని సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ అనీ, ఇటీవల ప్రకాష్ రాజ్ ఫార్మ్ హవుస్ కు వెళ్లి వస్తుంటే జరిగిన దొంగల దాడి ఆధారంగా తయారుచేసుకున్న కథ అనీ వార్తలు పుట్టుకోస్తున్నాయి. కానీ అసలు విషయం ఏమిటంటే, ఇవన్నీ సినిమా కోసం కోన వెంకట్ అండ్ కో పుట్టిస్తున్న వార్తలు తప్ప వాస్తవం కాదని మరో వెర్షన్ వినిపిస్తోంది,.

నిఖిల్ శంకరాభరణం సినిమా నికార్సయిన బాలవుడ్ సినిమా రీమేక్ అన్నది వాస్తవం. ఓ బాలీవుడ్ చిన్న సినిమా హక్కులు తీసుకుని, మన నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. కానీ అయితే కోనవెంకట్ అండ్ కో స్క్రిప్ట్ కు క్రేజ్ ఎక్కువ వుంటుంది కాబట్టి ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారన్నది అసలు విషయం. 

ఇదిలా వుంటే ఈ సినిమాలో కూడా నటి అంజలి కి మాంచి పాత్ర ఒకటి రెడీ చేసారట కోన వెంకట్. గీతాంజలి, తరువాత ఇప్పుడు బాలయ్య సినిమాలో కోన వెంకట్ ప్రమేయం వున్న సినిమాల్లో చేస్తోంది అంజలి. శంకరాభరణం కూడా అలాంటిదే. 

ఇది సరే, నందిత హీరోయిన్ అని ఫీలర్ వదిలారు. నిఖిల్ పక్కన నందిత సరిపోతుందా? ఆ మధ్య హీరో సుమంత్ అశ్విన్ పక్కన వేస్తే మిస్ మ్యాచ్ గా వుంది. పైగా సరైన హిట్ లు లేని అమ్మడు. అందువల్ల ఇది కూడా అవాస్తవమే కావచ్చు.

అల్లు అర్జున్ సరసన ఇద్దరు అమ్మాయిలతో సినిమాలో నటించిన కేథరిన్ థెరిస్సా పేరు పరిశీలనలో వున్నట్లు వినికిడి. చివరకు ఎవరు ఫైనల్ అవుతారో?