పెట్రో వాత.!

గత కొన్నాళ్ళుగా పెట్రోధరలు తగ్గతోన్న విషయం విదితమే. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో, నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక పలు దఫాలుగా పెట్రోధరల్ని దేశంలో తగ్గిస్తూ వచ్చారు. అడపా దడపా…

గత కొన్నాళ్ళుగా పెట్రోధరలు తగ్గతోన్న విషయం విదితమే. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో, నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక పలు దఫాలుగా పెట్రోధరల్ని దేశంలో తగ్గిస్తూ వచ్చారు. అడపా దడపా పన్నుల వాతతో అంతర్జాతీయ మార్కెట్‌కి తగ్గట్టుగా మాత్రం ధరలు తగ్గించలేదు. అయితే తాజాగా పెట్రోధరలు పెరిగాయి.

ఈ రోజు అర్థరాత్రి నుంచి పెంచిన పెట్రోధరలు అమల్లోకి రానున్నాయి. డీజిల్‌, పెట్రోల్‌పై మూడు రూపాయలకు పైగా ధర పెరగనుండడం గమనార్హం. తగ్గిన పెట్రోధరల ఘనత తమదేనంటూ ఘనంగా చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ సర్కార్‌కి నిజంగా ప్రజల మీద ప్రేమ వుంటే, ఇదివరకు పెంచిన సర్‌ఛార్జిలను సర్దుబాటు చేస్తే సరిపోయేది.

తగ్గినప్పుడు జనానికి ఆ తగ్గింపుని పరిమితంగా అందుబాటులోకి తీసుకురావడం, కాస్త పెరిగినా వినియోగదారులకు వాత పెట్టడం పాలకులకు అలవాటే.  అధికారంలో ఎవరున్నా చేసే పని ఇదే. నరేంద్ర మోడీ సర్కార్‌ ఇందుకు అతీతమేమీ కాదు.