టాలీవుడ్ లోకి ఎంట్రీని అనౌన్స్ చేసింది మెగా ఫ్యామిలీ అమ్మాయి కొణిదెల నీహారిక. టాలీవుడ్ హీరోలఫ్యామిలీల నుంచి అబ్బాయిలు వారుసులుగా రావడమే కానీ, అమ్మాయిలు రావడం కష్టం. అభిమానులతో, ఇంకా అనేకానేక సమస్యలు వుంటాయి. గతంలో మహేష్ సోదరి మంజుల సినిమా రంగప్రవేశం చేస్తామంటే కృష్ణ అభిమానులు కస్సుమన్నారు. దాంతో కృష్ణ వెనకంజ వేసారు.
ఎన్టీఆర్ తన కుమార్తెలంతో ఒకే ఒక్క సినిమాలో శాస్త్రీయ నృత్యం చేయించారు.ప్రస్తుతానికి మంచు లక్ష్మి ఒక్కరే ఫుల్ టైమ్ వారసురాలిగా వున్నారు. హీరోయిన్లు మాత్రం తమ అమ్మాయిలను హీరోయిన్లు చేస్తుంటారు. సరే, ఈ వ్యవహారం అంతా అలా వుంచితే, నీహారిక ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. ఇందుకు గాను ఆమె 40 లక్షల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా కొత్త హీరోయిన్లను ముంబాయి నుంచి తెచ్చినా, అయిదు నుంచి పది లక్షల వరకు తీసుకుంటారు. చిన్న సినిమాల హీరోయిన్లయితే ఫ్రీగా చేసే వాళ్లు కూడా వున్నారు.
నీహారిక విషయానికి వస్తే, నిర్మాత మధుర శ్రీధర్ రెమ్యూనిరేషన్ వ్యవహారం నాగబాబుకు, ఆమె వ్యవహారాలు చూసే సంస్థకు వదిలేసారని తెలుస్తోంది. దాంతో వాళ్లు నలభై లక్షలు అడిగినట్లు వినికిడి. ఎందుకంటే మెగా ఫ్యామిలీ క్రేజ్ సినిమాకు భయంకరంగా తోడవుతుంది కాబట్టి, ఆ మాత్రం వుండాలన్నారట. దాంతో నిర్మాత ఓకె అనేసినట్లు తెలుస్తోంది.