‘దూల తీరిందా’ పదంలో సంస్కారం వుందా?

ఎప్పుడో చదువు సంధ్యలు లేని పామరులు వాడుకున్న పదం ‘దూల తీరిందా’ అనేది. సినిమాల పుణ్యమా అని మహిళలు కూడా సిగ్గు లేకుండా పలికే పదం అయిపోయింది. దూల అనేది శృంగార భావనకు చెందిన…

ఎప్పుడో చదువు సంధ్యలు లేని పామరులు వాడుకున్న పదం ‘దూల తీరిందా’ అనేది. సినిమాల పుణ్యమా అని మహిళలు కూడా సిగ్గు లేకుండా పలికే పదం అయిపోయింది. దూల అనేది శృంగార భావనకు చెందిన నాటు పదం. ఈ ప్రస్తావన ఎందుకంటే అసలే బూతుల ప్రోగ్రామ్‌ ఈటీవీ జబర్‌దస్త్‌. నవ్విస్తూనే  బూతులు నేర్పే ఆ ప్రోగ్రామ్‌లో టాప్‌ హోస్ట్‌ అయిన రోజా కూడా పబ్లిక్‌గా దూల తీరిందా.. అని పలకడం ఒకింత షాకింగ్‌గానే వుంది. 

గతంలో ఆవిడ ‘ఇత్తడయిపోద్ది..’ లాంటి నాటు కామెడీ పదాలు పలికింది లెండి.. హీరోయిన్‌గా ఉన్నప్పుడు. అది వేరే సంగతి. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ మొదట ప్రయోగించిన ‘దూల తీరిందా’ అనే బూతుని ఆ తర్వాత ఎంతోమంది సొంతం చేసుకుని, ఇప్పుడు దాన్ని అవలీలగా వాడేసే తేలిక పదంగా మార్చేశారు. 

ఈటీవీ జబర్‌దస్త్‌ ప్రోగ్రామ్‌ చివర్న ఒక టాస్క్‌ ఇచ్చి అప్పటికప్పుడు నటించి, నవ్వించమంటారు. అలాంటి టాస్క్‌లో ఒక నటుడు సరదా కోసం.. ‘రోజా, నాగబాబు నవ్వొచ్చే నవ్వుతారా.? లేక నటిస్తారా.?’ అని అడిగాడు. దానికి ఇంకో నటుడు, మన కళ్ళెదురుగా షూటింగ్‌ చేస్తున్నారు. నీకు తెలీదా.. అని సమాధానం చెబుతాడు. వెంటనే రోజా కామెంట్‌.. ‘నీకు దూల తీరిందా’ అని. 

అలా ఆవిడ నవ్వులాటకు చెప్పినా, ఆమె స్థాయిని దిగజార్చే విధంగా వుండటం ఇబ్బంది.. అని అనిపించకమానదు. ఇలాంటి కార్యక్రమాలకు కొన్ని హద్దులు వుండాలి. లేకపోతే దూల తీరిందా.. తొక్కలోది.. బొచ్చు… పైనా కిందా మూస్కో.. లాంటి పదాలు సరళమయిపోతాయి. మనుగడకు మచ్చ తెస్తాయనడంలో సందేహం ఏముంది.?