అప్పుడు చెయ్యనిది ఇప్పుడు చేస్తున్నాడట

కాలం కలిసిరాక ఎన్నో పనులు ఆగిపోతుంటాయి. అప్పుడెప్పుడో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కళ్ళు చిదంబరం హీరోగా సినిమా చెయ్యాలనుకున్నాడన్న సంగతి తెల్సిందే. పరిస్థితులు కుదరక చెయ్యలేదు. ఇప్పుడు కూడా ఆయన అలాంటి ప్రయత్నమే…

కాలం కలిసిరాక ఎన్నో పనులు ఆగిపోతుంటాయి. అప్పుడెప్పుడో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కళ్ళు చిదంబరం హీరోగా సినిమా చెయ్యాలనుకున్నాడన్న సంగతి తెల్సిందే. పరిస్థితులు కుదరక చెయ్యలేదు. ఇప్పుడు కూడా ఆయన అలాంటి ప్రయత్నమే చెయ్యబోతున్నాడా? అంటే ఔననే అంటున్నారు సన్నిహితులు. 

ప్రస్తుతం ‘ఐస్‌క్రీమ్-2’ పూర్తి చేశాడు. ఇక సంపూర్ణేష్‌బాబు హీరోగా ఒక సెటైరికల్‌ మూవీని తీసే ప్రయత్నంలో వర్మ వున్నాడంటున్నారు. ‘హృదయకాలేయం’  సినిమాతో మొత్తం ఇండస్ట్రీని ఆకట్టుకున్న సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం ‘కొబ్బరిమట్ట’, ‘సింగం రిటర్న్‌ 123’ సినిమాలతో బిజీగా వున్నాడు. 

రామ్‌గోపాల్‌ వర్మ ఆల్రెడీ ‘పోకిరి రిటర్న్‌’ అనే టైటిల్‌ని రిజిస్టర్‌ చేయించాడనీ, మహేష్‌బాబు పాత్రని కామెడీగా సంపూతో తియ్యడానికి రెడీ అయిపోయాడని గుసగుసలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం పెద్ద హీరోల గాలి తీసే పాత్రల్లో సంపూర్ణేష్‌బాబు బాగా అలరిస్తున్నాడు కాబట్టి, ఖచ్చితంగా ఆ సినిమాకు హైప్‌ వస్తుందంటున్నారు. అయితే గతంలో వర్మ తీసిన ‘షోలే’ రీమేక్‌లా ఇది కాకూడదని కోరుకుందాం.