మనిషి అన్నాక అందరికీ విజయాలు దక్కాలని రూలేం లేదు కదా. ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాతే విజయం వరిస్తుంది. అలాగే సినిమాలు కూడా చేసుకుంటూ పోతేనే ఏదో ఒకటి హిట్ అవుతుందని చెబుతున్నాడు అల్లరి నరేష్.
ఇటీవల విడుదలైన ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’ అనుకున్నంత విజయాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన ఆశలన్నీ సొంత బ్యానర్‌లో నిర్మిస్తూ నటిస్తున్న బందిపోటు సినిమాపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాకు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వం ప్లస్ అవుతుందనీ, గతంలో ఆయన చేసిన సినిమాలన్నీ మినిమమ్ గ్యారంటీ ఇచ్చాయి కాబట్టి నాతో చేస్తున్న బందిపోటు విజయాన్ని దక్కించుకుంటుందనే ధీమాతో వున్నానని చెబుతున్నాడు.
ఈవీవీ బ్యానర్‌ని మళ్ళీ పునరుద్ధరించి సినిమాలు తియ్యడం వల్ల నాన్నగారిని స్మరించుకున్నట్లు, ఆయన ఆశయాలు కొనసాగిస్తున్న సంతృప్తి కూడా వుంటుందనీ, హీరోగా తనకు అవకాశాలు వెల్లువలా వున్నాయనీ, అయితే కథ, కథనాల విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నాకే సినిమాలు ఒప్పుకుంటున్నాననీ పెద్ద దర్శకులతో కూడా ప్రాజెక్టులు వున్నాయనీ ఇప్పుడున్న స్థితిలో ప్రేక్షకులను నవ్వించడం, కత్తిమీద సామేనని నరేష్ చెబుతున్నాడు.