కృష్ణారెడ్డి.. ఇంకోసారి

కుటుంబ క‌థా చిత్రాల ద‌ర్శకుడిగా పేరు తెచ్చుకొన్నారు కృష్ణారెడ్డి. ఒక‌టా రెండా… న‌ల‌భై సినిమాలు తీశారు. అందులో పాతిక హిట్టయ్యాయి. ఆ లెక్కన‌.. విజ‌యాల శాతం ఎక్కువ‌గానే ఉంది. అయితే స్టార్ హీరోల‌తో చేసిన…

కుటుంబ క‌థా చిత్రాల ద‌ర్శకుడిగా పేరు తెచ్చుకొన్నారు కృష్ణారెడ్డి. ఒక‌టా రెండా… న‌ల‌భై సినిమాలు తీశారు. అందులో పాతిక హిట్టయ్యాయి. ఆ లెక్కన‌.. విజ‌యాల శాతం ఎక్కువ‌గానే ఉంది. అయితే స్టార్ హీరోల‌తో చేసిన సినిమాలు మాత్రం క‌ల‌సి రాలేదు. తానూ హీరోగా వెలిగిపోదామ‌ని కొన్ని ప్రయ‌త్నాలు చేశారు. అవీ స‌ఫ‌లం కాలేదు. 

పిద‌ప ద‌ర్శకుడిగా కూడా ట్రాక్ త‌ప్పడంతో కొన్నాళ్ల నుంచి ఆయ‌న మ‌రీ స్లో అయ్యారు. య‌మ‌లీల 2 కూడా బాల్చీ త‌న్నేయ‌డంతో మెగాఫోన్‌పై దృష్టి పెట్టలేదు. ఇప్పుడు మ‌ళ్లీ డైరెక్షన్ వైపు మ‌న‌సులాగింది. 

ఓ మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌తో, ఓ పెద్ద హీరోతో సినిమా చేయ‌డానికి ప్రయ‌త్నాలు స్టార్ట్ చేశారు. త్వర‌లోనే.. ఆ హీరో ఎవ‌ర‌నే విష‌యాల్ని బ‌య‌ట‌పెడ‌తార‌ట‌. ఈసారైనా కృష్ణారెడ్డికి పూర్వ వైభ‌వం వ‌స్తుందేమో చూడాలి.