లోకేశ్‌దేం త‌ప్పు…అయితేగియ‌తే బొత్సదే!

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ గురించి గొప్ప‌గా ఊహించుకోవ‌డం మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌దే త‌ప్ప‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్స్ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విద్యాశాఖ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. …

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ గురించి గొప్ప‌గా ఊహించుకోవ‌డం మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌దే త‌ప్ప‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్స్ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విద్యాశాఖ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. 

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌తిరోజూ రాష్ట్రంలో ఎక్క‌డో ఒక చోట పేప‌ర్స్ లీక్ అవుతున్నట్లు వార్త‌లొస్తున్నాయి. క‌నీసం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను కూడా స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌లేని అస‌మ‌ర్థ ప్ర‌భుత్వంగా ప్ర‌తిప‌క్షాలు ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ బుధ‌వారం మీడియాతో మాట్లాడారు. ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వారిపై చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. అక్కడక్కడ చిన్న సంఘటనలు జరిగితే రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయని తేలిగ్గా చెప్పుకొచ్చారు. పేరెంట్స్ మనోభావాలను దెబ్బ తీయవద్దని మంత్రి బొత్స కోరారు.

టెన్త్ పేపర్ లీకుల విషయంలో నారాయణ, చైతన్య, కేరళ ఇంగ్లీషు మీడియం స్కూల్ తదితర అక్రమాలకు పాల్పడిన వాటిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అవసరమైతే ఆ స్కూళ్ల లైసెన్స్‌లు రద్దు  చేస్తామ‌ని హెచ్చ‌రించారు. పరీక్షలు అయిన తర్వాత రాజకీయాలు మాట్లాడదామ‌ని చెప్పారు. లోకేశ్‌ ఆరోపణలు ఛీప్ గా ఉన్నాయ‌ని బొత్స ఆరోపించ‌డం గ‌మ‌నార్హం. ఆరు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అతనికి పట్టదా? అని మంత్రి  ప్రశ్నించారు.

నారా లోకేశ్ ఎప్పుడైనా హూందాగా మాట్లాడిన సంద‌ర్భాలు ఉన్నాయా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. హూందాత‌నానికి, లోకేశ్‌కు అస‌లు పొస‌గ‌ద‌ని, అలాంట‌ప్పుడు ఆయ‌న నుంచి దాన్ని కోరుకోవ‌డం బొత్స స‌త్య‌నారాయ‌ణ‌దే త‌ప్ప‌ని నెటిజ‌న్స్ వ్యంగ్యంగా కామెంట్స్ పెట్ట‌డం విశేషం. అయినా లోకేశ్ గురించి ఉన్న‌తంగా బొత్స ఎలా ఊహించుకున్నారో అని మ‌రికొంద‌రు ప్ర‌శ్నించారు.