సుబ్రహ్మణ్యం వెనుక మాజీ మంత్రి?

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్..దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా. ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా నిర్మాత అధికారికంగా దిల్ రాజే. అందులో సందేహం లేదు. కానీ అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ…

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్..దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా. ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా నిర్మాత అధికారికంగా దిల్ రాజే. అందులో సందేహం లేదు. కానీ అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి, ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రికి అనుకూలంగా వుంటున్న పెద్దాయిన కు సంబంధించిన వారు తెరవెనుక నుంచి ఈ సినిమాకు పెట్టుబడి అందించినట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

రాజకీయ నాయకుల పుత్ర రత్నాలు ఇలా బినామీ పెట్టుబడులు పెట్టడం పెద్ద ఆశ్చర్యం కాదు. తెలంగాణ కు చెందిన ఓ బడాప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ వెనుక కూడా ఇలాంటి పెట్టుబడులు వున్నాయంటారు. అందెంత నిజమో తెలియదు కానీ, ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో కూడా సదరు మాజీ మంత్రి కుమారుడు, స్నేహితులు పెట్టుబఢి పెట్టారని తెలుస్తోంది.