దసరా సీజన్ పోటీకి శివం రెడీ అయింది..డేట్ ప్రకటించింది. కానీ వరుణ్ తేజ్-క్రిష్ ల కంచె కాస్త ఆలస్యం కానుంది. దసరాకు బదులు దీపావళి సీజన్ ను ఆ సినిమా ఎంపిక చేసుకుంటోంది. అక్టోబర్ నెలలో అన్ని భారీ సినిమాలు అనేసరికి, థియేటర్లు ఎక్కడ దొరుకుతాయి, కలెక్షన్లు ఎన్నింటికి వస్తాయి, అన్న అనుమానాలు వుండనే వున్నాయి.
పైగా అప్ కమింగ్ హీరో పై ముఫై కోట్లకు పైగా ఖర్చు చేసారు కంచె నిర్మాతలు. పైగా అదీ మాస్ సినిమా కాదు అది. అందువల్ల దాన్ని ఇలాంటి కాంపిటీషన్ జోన్ లో కన్నా, సేఫ్ జోన్ లో తీసుకురావాలనుకున్నాడు క్రిష్. పైగా అప్ కమింగ్ హీరో కాబట్టి ఇగోలు, ఫాల్స్ ప్రిస్టేజ్ లు వంటివి లేవు. ఇక అదే డేట్ కు కాస్త అటు ఇటుగా పులి విడుదల వుంటుంది. ఈ రెండు సినిమాలకు మధ్య కంచె ఎందుకు..అందుకే వాయిదా పడిపోయింది.
మరోపక్క రుద్రమదేవి కోసం నైజాం, వైజాగ్ ల్లో దిల్ రాజు, నైజాంలో సాయి కొర్రపాటి, ఎన్వీప్రసాద్, ఈస్ట్ లో గీతా థియేటర్లను బ్లాక్ చేసాయి. మరి అలాంటపుడు థియేటర్లుఎక్కడ నుంచి వస్తాయి. పైగా రామ్ చరణ్ ఎప్పటిలా తక్కువ కాంపిటీషన్ వున్నపుడు కాకుండా, చాలా టఫ్ కాంపిటీషన్ నడుమ రావడం ఈసారి దసరా స్పెషల్.
పైగా పక్కవారమే మరో పెద్ద సినిమా పెట్టుకుని..మరి ఇలాంటి నేపథ్యంలో దసరా సీజన్ పోటీ నుంచి మరేమైనా సినిమాలు పోటీ నుంచి తప్పుకుంటాయా? లేదు..సవాల్ అంటూ గోదాలో దిగుతాయా? చూడాలి?