తమిళంలో సినిమాల మీద సినిమాలు తీస్తూ, పనిలో పనిగా తెలుగునాట కూడా వదుల్తున్నాడు విశాల్. సినిమా హిట్టా..ఫట్టా అన్నది, సమీక్షకులు మెచ్చుకున్నారా లేదా అన్నది ఎలా వున్నా, కలెక్షన్లు మాత్రం బాగానే సంపాదించుకుంటున్నాయి.
పూజ డబ్బింగ్ వెర్షన్ విశాల్ కు బాగానే లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆ ఊపు మగమహారాజు మీద పడింది. ఏకంగా 474 స్క్రీన్లలతో తెలుగునాట విడుదలవుతోంది. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి తమిళనాట విడుదలయింది. పెద్దగా మంచి టాక్ ఏమీ తెచ్చుకోలేదు. అలాంటిది ఇక్కడ మాత్రం ఇన్ని స్క్రీన్లలో విడుదలవుతోంది.
విశాల్ సినిమా కావడం, పైగా సుందర్ సి డైరక్షన్ అంటే బి సి సెంటర్ జనాల అభిరుచికి సరిపడా ముతక ముడి సరుకు వుంటుందన్న నమ్మకంతో ఈ సినిమాను పట్టుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు. పైగా ఏ హడావుడి పెద్దగా చేయకుండా, కేవలం టీవీ పబ్లిసిటీతో వదిలేసారు. దీంతో పాటు విడదలవుతున్న రామ్ లీల, భంభోలేనాధ్, సినిమాలకు ఆఫ్టర్ నూన్ టైమింగ్ లు ఇచ్చిన మల్టీఫ్లెక్స్ లు విశాల్ సినిమాకు మాత్రం మార్నింగ్ టైమ్ కేటాయించడం విశేషం.