ఓంకారన్నయ్య…తమ్ముడి సినిమా

ఓంకార్ అన్నయ్యా అంటూ..టీవీలో మారుమోగిపోయాడు..ఆట కార్యక్రమంతో. ఆ తరువాత జీనియస్ అంటూ సినిమా డైరక్ట్ చేసి, మరి కనిపించలేదు. ఇప్పుడు మరో సినిమాతో బిజీగా వున్నాడట. హీరోగా మరెవరో ఎందుకుని, తన తమ్ముడు అశ్విన్…

ఓంకార్ అన్నయ్యా అంటూ..టీవీలో మారుమోగిపోయాడు..ఆట కార్యక్రమంతో. ఆ తరువాత జీనియస్ అంటూ సినిమా డైరక్ట్ చేసి, మరి కనిపించలేదు. ఇప్పుడు మరో సినిమాతో బిజీగా వున్నాడట. హీరోగా మరెవరో ఎందుకుని, తన తమ్ముడు అశ్విన్ ఓంకార్ నే ఎంచుకున్నాడట. వైవిధ్యమైన హర్రర్ కామెడీ జోనర్ ఇది. 

మాటీవీ ఫౌండర్ రాజుతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సినిమా పేరు కూడా చిత్రంగానే వుంది..’రాజుగారి గది’. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయిపోయింది,. పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ అయ్యాయి. అన్నట్లు ఈ సినిమా విడుదల కాకుండానే అశ్విన్ ఓంకార్ ఊర్వశి ఓ రాక్షసి అనే సినిమా కూడా చేసేస్తున్నాడట.