సుశాంత్ సినిమా లేనట్లేనా?

వెంకటాద్రిఎక్స్ ప్రెస్ తో మాంచి హిట్ ఇచ్చి, సినిమారంగలో జెండా పాతాడు రచయిత మేర్లపాక మురళి కుమారుడు మేర్లపాక గాంధీ. కానీ ఆ తరువాత ఇంతవరకు సినిమా లేదు. ఇదిగో అదిగో అని మాత్రమే…

వెంకటాద్రిఎక్స్ ప్రెస్ తో మాంచి హిట్ ఇచ్చి, సినిమారంగలో జెండా పాతాడు రచయిత మేర్లపాక మురళి కుమారుడు మేర్లపాక గాంధీ. కానీ ఆ తరువాత ఇంతవరకు సినిమా లేదు. ఇదిగో అదిగో అని మాత్రమే వినిపించింది. సుశాంత్ దగ్గర లాకయ్యాడని,త్వరలో ఆ సినిమా పట్టాలెక్కుతుందని వినిపించింది.

అయితే ఇప్పుడు ఆ సినిమా వుందో లేదో అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే గాంధీ ఇటీవల వెవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ తన స్థానం పదిలం చేసుకుంటున్న శర్వానంద్ దగ్గర ఓ లైన్ కు ఓకే చేయించుకున్నాడని వినికిడి,. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ పనిమీదే జోరుగా వున్నాడట. అంటే మరి సుశాంత్ సినిమా లేనట్లేనా?