దాసరి నిర్మాత..పవన్ డైరక్టర్..సత్యాగ్రహి

సినిమా ఎప్పుడు వుంటుందో ఎవరూ చెప్పలేరు కానీ, పవన్-దాసరి సినిమాకు డైరక్టర్ పవనే నట. పవన్ ఎప్పుడో అనుకున్న సత్యాగ్రహి సినిమాను బయటకు తీయాలని అనుకుంటున్నాడు. అలా అయితే తనకు అభ్యంతరం లేదని దాసరి…

సినిమా ఎప్పుడు వుంటుందో ఎవరూ చెప్పలేరు కానీ, పవన్-దాసరి సినిమాకు డైరక్టర్ పవనే నట. పవన్ ఎప్పుడో అనుకున్న సత్యాగ్రహి సినిమాను బయటకు తీయాలని అనుకుంటున్నాడు. అలా అయితే తనకు అభ్యంతరం లేదని దాసరి కూడా అనడంతో, ఈ సినిమా ఓకె చేసుకున్నారు ఇద్దరూ. 

సత్యాగ్రహి కాస్త పొలిటికల్ టచ్ వున్న సబ్జెక్ట్ అని తెలుస్తోంది. అంటే జానీ తరువాత మళ్లీ మరోసారి పవన్ మెగాఫోన్ పట్టబోతున్నాడన్నమాట. ఈ సినిమాను గోపాల గోపాల మాదరిగా పార్టర్నర్ షిప్ వ్యవహారం వుంటుందంటున్నారు. పవన్ హీరో, డైరక్టర్ రెమ్యూనిరేషన్లే పెట్టుబడి. మిగిలిన స్టార్ కాస్ట్, ప్రొడక్షన్ దాసరి వంతు. 

గోపాల గోపాల బాగానే కిట్టుబాటు అయింది. అందువల్ల ఇక్కడ కూడా పవన్ వంతు పక్కన పెడితే మహా అయితే పది పదిహేను కోట్లలో కానిచ్చేయచ్చు. అన్నీ బాగానే వున్నాయి కానీ ఎప్పుడు మొదలవుతుందన్నదే సమస్య.