మ‌రో ‘హార్ట్ ఎటాక్‌’

పూరి జ‌గ‌న్నాథ్ య‌మ బిజీ అయిపోయాడు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడే ఖాళీ లేకుండా సినిమాలు తీశాడీయ‌న‌. ఇప్పుడు టెంప‌ర్ లాంటి హిట్టొస్తే త‌గ్గుతాడా??  చ‌క చ‌క త‌న సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. చిరు 150వ సినిమా గురించి…

పూరి జ‌గ‌న్నాథ్ య‌మ బిజీ అయిపోయాడు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడే ఖాళీ లేకుండా సినిమాలు తీశాడీయ‌న‌. ఇప్పుడు టెంప‌ర్ లాంటి హిట్టొస్తే త‌గ్గుతాడా??  చ‌క చ‌క త‌న సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. చిరు 150వ సినిమా గురించి ఆలోచించ‌కుండా.. మిగిలిన ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెట్టాడు. 

వ‌చ్చే నెల‌లో జ్యోతిల‌క్ష్మి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆ త‌ర‌వాత మేలో వ‌రుణ్‌తేజ్ సినిమా ఉంటుంది. ఇప్పుడు నితిన్ కూడా లైన్లో కొచ్చాడు. పూరి – నితిన్‌లో ఓ సినిమా త్వర‌లోనే ప‌ట్టాలెక్కబోతోంద‌ని టాక్‌. హార్ట్ ఎటాక్ సినిమా అనుకొన్న అంచ‌నాల్ని అందుకోలేదు. అయినా పూరితో మ‌ళ్లీ ఓ సినిమా చేయాల‌ని నితిన్ భావిస్తున్నాడ‌ట‌. 

నితిన్ తో కుదిరిన ట్యూనింగ్ కోస‌మైనా ఓ సినిమా చేయాల‌ని పూరీ ఫిక్స్ అయ్యాడు. 2015లోనే ఈ సినిమా ఉంటుంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి.