వాస్తు మార్పుల్లో శ్రీకాంత్?

చంద్రబాబు వాస్తు ప్రకారం రాజథాని కడతారు.కేసిఆర్ వాస్తు కోసం సచివాలయాన్ని మారుస్తారు..చిరంజీవి ఇంటకి వాస్తు మార్పులు చేయించారు. ఇప్పుడు హీరో శ్రీకాంత్ కూడా ఇదే బాట పట్టినట్లు తెలుస్తోంది. ఆయన కూడా ఇటీవల తన…

చంద్రబాబు వాస్తు ప్రకారం రాజథాని కడతారు.కేసిఆర్ వాస్తు కోసం సచివాలయాన్ని మారుస్తారు..చిరంజీవి ఇంటకి వాస్తు మార్పులు చేయించారు. ఇప్పుడు హీరో శ్రీకాంత్ కూడా ఇదే బాట పట్టినట్లు తెలుస్తోంది. ఆయన కూడా ఇటీవల తన ఇంటికి వాస్తు మార్పులు చేయించారని టాలీవుడ్ వర్గాల బోగట్టా. 

చిన్న పాత్రలతో కేరీర్ ప్రారంభించి, హీరోగా మారి, మాంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ కు ఇటీవల టైమ్ అంతగా కలిసిరావడంలేదు. చేసిన సినిమాలు సరిగ్గా ఆడకపోవడం, కొన్ని విడుదల కాకపోవడం ఇలా..దీంతో ఆయన ఇంటికి వాస్తు మార్పులు చేయించినట్లు సినిమా జనాలు చెప్పుకుంటున్నారు. నిజానికి మిడిల్ ఏజ్డ్ హీరోలందరికీ పెద్దగా ఇప్పుడు టైమ్ రావడం లేదు. వైవిధ్యమైన సబ్జెక్ట్ లు, మల్టీస్టారర్లు, అదీ స్వంత బ్యార్ అయితే తప్ప అంతగా ఫలితం వుండడం లేదు. 

టైమ్ బాగుండనది ఒక్క శ్రీకాంత్ కే కాదు..మారుతున్న అభిరుచులు, యూత్ హీరోలు రావడం ఇలా చాలా కారణాలున్నాయి దీనికి. మిడిల్ ఏజ్డ్ హీరోలు పుస్తకాలు పట్టుకుని కాలేజీకి వెళ్లే పాత్రలుచేయలేరు.అలా అని శ్రీకాంత్ లాంటి బబ్లీ ఫేస్ లకు మాస్ సినిమాలు అంతగా నప్పవు. ఫ్యామిలీ సినిమాలు ఇప్పుడు అంతగా చూడడం లేదు. తప్పుదు ఒక్కోసారి ఇలాగే వుంటుంది టైమ్.