పావలాకు సినిమా తీసి, పది రూపాయల బిజినెస్ చేయగల సమర్థుడు రాంగోపాల్ వర్మ. ఆయన సినిమాలతో ప్రేక్షకులు విగిసిపోయినా.. ఆయకు మాత్రం.. బాగానే గిట్టుబాటు అవుతున్నాయి. ఐస్ క్రీమ్ సినిమాని రెండున్నర లక్షల్లో చుట్టేసి – సంచలనం సృష్టించాడు. దొంగలముఠా 5 రోజుల్లో ముగించాడు.
చిన్న సినిమాల వల్ల వర్మ ఆర్థికంగా నిలబడినా క్రేజ్ మాత్రం ఢమాల్మంది. వర్మ ఇలాంటి సినిమాలు తీస్తూనే ఉంటాడులే..అని ప్రేక్షకులూ లైట్ తీసుకొంటున్నారు. అందుకే.. వర్మ ఇప్పుడో నిర్ణయానికి వచ్చాడట. చిన్నసినిమాలు తీయకూడదని నిర్ణయించుకొన్నాడట.
అంతేకాదు.. ఇక మీదట హారర్ జోనర్నీ ముట్టుకోడట. స్టార్లూ, మినిమం గ్యారెంటీ ఉన్న హీరోలతోనే సినిమా చేయాలని వర్మ డిసైడ్ అయ్యాడట. మరి ఈ నిర్ణయం వెనుక ఎలాంటి ఉద్దేశ్యాలున్నాయో. అన్నట్టు ఇప్పుడు తీస్తున్న ఎటాక్ కూడా.. భారీ బడ్జెట్ సినిమానేనట. ఈ బడ్జెట్ ఓ ఇరవై ఐస్క్రీమ్లు తీయొచ్చని టాక్.