మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తరువాత తెరపై కన్పించే బ్రూస్ లీ సినిమా చకచకా రెడీ అవుతోంది. ఈ సినిమాలో చిరు పాట కోసం ఓ అయిటమ్ భామను ఇంకా ఎంపిక చేయాల్సి వుంది. కానీ టైమ్ తక్కువ వుందని, ముందుగా చిరుపై చిత్రీకరించాల్సిన ఫైట్ ను చకచకా కానిచ్చేస్తున్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఫైట్ ను చిత్రీకరిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ షూట్ వుంటుంది. క్లయిమాక్స్ లో తండ్రినా, ప్రియురాలినా ఎవరిని రక్షించాలి అన్న డైలమా వచ్చినపుడు తండ్రే కావాలని చూజ్ చేసుకుంటాడు హీరో చరణ్. అలాంటి సమయంలో సినిమాలో నిజం హీరో అయిన చిరు రంగంలోకి దిగి హీరోయిన్ రకుల్ ను రక్షించేదుకు భారీ ఫైట్ చేస్తాడు. అదే ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు.
ఈ ఫైట్ అయ్యేలోగా జోడీ సెట్ అయితే, పాట పిక్చరైజేషన్ కూడా కంటిన్యూ చేసేస్తారు. ఇందుకు సంబంధించిన సెట్ దాదాపు రెడీ చేసేసారని వినికిడి..పాట రెడీగా వుంది. అమ్మాయి దొరకడం ఆలస్యం..రెండు రోజుల్లో కానిచ్చేస్తారు.