కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో కామన్ పాయింట్ అయింది. పరిశ్రమలతో సంబంధం లేకుండా, ప్రతి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాధితులు ఉన్నారు. కొంతమంది హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాల్ని బయటపెడితే, మరికొంతమంది మాత్రం తమకు అలాంటివేం జరగలేదని చెప్పుకొచ్చారు.
ఇప్పుడీ లిస్ట్ లోకి హాట్ బ్యూటీ షెర్లీన్ చోప్రా చేరింది. తన అందాలతో మత్తెక్కించే ఈ బ్యూటీ.. తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది. కొంతమంది దర్శకులు తనను బాడీషేమింగ్ చేసిన విధానాన్ని బయటపెట్టింది.
“వక్షోజాలకు సర్జరీ చేయించుకున్నావా అని నన్ను కొంతమంది దర్శకులు అడిగారు. అందులో దాచిపెట్టడానికేం లేదు. నేను సర్జరీ చేయించుకున్నాను. నా పైభాగం ఫ్లాట్ గా ఉండడం నాకు నచ్చలేదు. అదే విషయం చెప్పాను. వెంటనే వాళ్లు ఓసారి టచ్ చేయొచ్చా, సైజ్ ఎంత అని అడిగారు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. సైజ్ చూసి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారా. నన్ను అలా అడిగిన దర్శకుడికి అప్పటికే పెళ్లయింది. తన భార్యతో ఇంత ఓపెన్ గా మాట్లాడడంట. నాతో మాత్రం మాట్లాడతానంటున్నాడు.”
ఇలా తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది షెర్లీన్ చోప్రా. తను ఎదుర్కొన్న ఆడిషన్స్ లో చాలామంది దర్శకులు, తనను వేరే కోణంలోనే చూశారని, అలాంటి ప్రశ్నలే అడిగారని చెప్పుకొచ్చిన షెర్లీన్… ఆ డైరక్టర్ల పేర్లు మాత్రం బయటపెట్టలేదు.
కుటుంబం నుంచి, పరిశ్రమ నుంచి సపోర్ట్ దక్కకపోయినా.. ఒక్కో మెట్టు పైకెక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నానని.. ఈ క్రమంలో చాలా అవమానాలు, కొన్ని ప్రశంసలు దక్కించుకున్నానని చెబుతోంది షెర్లీన్. ఒక దశలో తీవ్రమైన ఆందోళనకు గురై, ట్రీట్ మెంట్ కూడా తీసుకున్న విషయాన్ని వెల్లడించింది ఈ బ్యూటీ.