సెలీనా జైట్లీ.. ఒకప్పుడు కుర్రకారును ఉర్రూతలూగించిన హీరోయిన్. సాంగ్స్ లో ఆమె అందాలకు స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఒక టైమ్ లో హీరోయిన్లతో సమానంగా ఐటెంసాంగ్స్ కు పారితోషికం అందుకున్న బ్యూటీ ఈమె. ఇప్పుడీ బ్యూటీ మరోసారి వార్తల్లోకెక్కింది. తనకున్న ఓ అరుదైన లక్షణాన్ని బయటపెట్టింది.
సెలీనా జైట్లీకి ఓ జన్యుపరమైన సమస్య ఉంది. ఇది చాలా అరుదైన పరిస్థితి. అదేంటంటే.. ఈమెకు వద్దన్నా కవలలు పుడతారు. శారీరకంగా కలిసిన తర్వాత జరిగే పునరుత్పత్తి ప్రక్రియలో ఓ రకమైన జన్యులోపాన్ని కలిగి ఉంది సెలీనా. అందుకే ఆమెకు వద్దన్నా కవలలు జన్మిస్తారు.
అలా అని ఏకరూప కవలలు కూడా కాదు. వేర్వేరు రూపాల్లో ఇద్దరు పిల్లలు పుడతారు. అలా 2012లో కవలలకు జన్మనిచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 2017లో కూడా కవలలకు జన్మనిచ్చింది.
తాజాగా తన జన్యులోపాన్ని బయటపెట్టింది సెలీనా జైట్లీ. అందుకే తనకు అలా వరుసగా కవలలు పుట్టారని, అంతేతప్ప, తను ప్రత్యేకంగా ఎలాంటి ట్రీట్ మెంట్ తీసుకోలేదని వెల్లడించింది. తొలిసారి కవలలు జన్మించినప్పుడు ఈ విషయాన్ని గుర్తించిందట సెలీనా.
2011లో బిజినెస్ మేన్ పీటర్ పీటర్ హాగ్ ను పెళ్లి చేసుకుంది సెలీనా. పెళ్లయిన ఏడాదికే కవలలకు జన్మనిచ్చింది. అయితే 2017లో పుట్టిన కవలల్లో ఒక మగ బిడ్డను ఆమె కోల్పోవాల్సి వచ్చింది. హార్ట్ ప్రాబ్లెమ్ తో పుట్టిన సంషేర్, కొన్ని రోజులకే చనిపోయాడు. అతడితో పాటు పుట్టిన ఆర్థర్ మాత్రం కాలక్రమంగా కోలుకున్నాడు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. అలా ముగ్గురు పిల్లలతో బిజీగా లైఫ్ గడిపేస్తోంది సెలీనా జైట్లీ.