అఖిలి సినిమా అడియో ఫంక్షన్ సింపుల్ అండ్ సూపర్బ్ గా జరిగింది. చూసిన ప్రతి ఒక్కరు నాగ్, నితిన్ ప్లానింగే ప్లానింగ్ అనుకున్నారు. స్టేజ్ మీద పాటలు లాంచ్ చేసిన తీరు, మరీ అతి కాకుండా జరిగిన డ్యాన్స్ షోలు, అక్కర్లేని విషయాలు లేకుండా, చకచగా సాగిన పద్దతి చూసి అందరూ ఫంక్షన్ బాగా జరిగిందని కితాబు ఇచ్చారు.
అయితే ఈ ఫంక్షన్ ప్లానింగ్ అంతా దర్శకుడు వినాయక్ దేనట. నాగ్ తన సినిమా షూటింగ్ కోసం మైసూరు కు ముఫై కిలో మీటర్ల దూరంలో బిజీగా వున్నాడు. అఖిల్, నితిన్ వ్యవహారం అంతా వినాయక్ కే వదిలేసారంట. దాంతో ఆయన టోటల్ ప్లానింగ్ అంతా చకచకా కానిచ్చారట. అదీ విషయం.
అంటే వినాయక్ సినిమాలే కాదు, ఈవెంట్లు కూడా బాగానే మేనేజ్ చేస్తారన్నమాట. ఈ సంగతి ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇక మీదట వినాయక్ పై నిర్మాతలు, హీరోలు ఈ భారం కూడా వేసేస్తారేమో?