తెరపై మాత్రం దున్నేస్తాడు… యమ యాక్టివ్ గా కనిపిస్తాడు. గళ గళ మాట్లాడేస్తాడు.. తన మాటలతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తాడు… హీరోయిన్ ని, సినిమాల్లో తను బుట్టలోకి వేసుకోవాల్సిన పాత్రలను ఇట్టే పడేసుకొంటాడు… ఇంతా తెరపై అతడి మాటల మహిమ! మరి తెర మీద నుంచి పక్కకు వస్తే మాత్రం ఆ హీరోగా జీరో అవుతున్నాడు. మాటల కోసం తడబాటు… పదాల కోసం వెతుక్కోవడం… ఈ తరహాను అచ్చ తెలుగులో చెప్పాలంటే నత్తి! ఆ కుర్రహీరో పరిస్థితి అది. మామూలుగా పిచ్చాపాటి మాట్లాడాలంటేనే తెగ ఇబ్బంది పడిపోతాడు. ఇక షూటింగ్ సమయంలో… డైలాగులు చెప్పాలంటే అతడి ఇబ్బంది అంతా ఇంతా కాదు!
అందుకే అతడి సినిమాల్లో పొడి పొడి డైలాగులే ఉంటాయి. లెంగ్తీ డైలాగులతో లాగకుండా.. ఒక వాక్యాన్నే నాలుగైదు సార్లు విరమమిచ్చి ఫ్లోని కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. షూటింగ్ స్పాట్ లో ఏదో అలా లాగించేస్తారు. ఇక అసలైన డబ్బింగ్ సమయంలో అతడి పరిస్థితి మరీ ఇబ్బందికరం! పదాలను కూడబలుక్కుని వాక్యంగా చేయడం చాలా కష్టం.. పాపం! దీంతో తను డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరూ ఉండకుండా చూసుకొంటూ ఉంటాడు! ఈ మధ్య మంచి ఫామ్ లో ఉన్నాడు.. దీంతో ఇతడి సినిమాల యూనిట్లు పూర్తిగా సహకరిస్తున్నాయి. షరతులకు అప్పుకొంటున్నాయి.
సాధారణంగా డబ్బింగ్ చెప్పేటప్పుడు.. వీలైతే డైరెక్టర్ లేకపోతే.. అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండటం జరుగుతుంది. అయితే అలా ఎవరైనా ఉంటే ఇతడికి దిక్కుతెలియదు. వాళ్ల ముందు తన బలహీనత బయటపడిపోతుందనే భయం తో మరింతగా ఇబ్బంది పడతాడు. దీంతో ఇతగాడు డబ్బింగ్ చెప్పేటప్పుడు.. అంతా బయటకు వెళ్లిపోతారు. తన పాట్లేవో తను పడి ఆ ప్రాసెస్ ను పూర్తి చేస్తాడు.. తెరపై ఏమో హీరో ఇబ్బంది అర్థమవుతూనే ఉంటుంది! తొలి తొలి సినిమాల్లో ఈ హీరోకి మరో నటుడు డబ్బింగ్ చెప్పేవాడు… ప్రస్తుతానికి అయితే తనే పాట్లు పడి బండి లాగిస్తున్నాడు.