పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్న ‘బ్రో’ ట్రయిలర్ విడుదలయింది. ఈ ట్రయిలర్ ఎలా వుంటుంది అని ఫ్యాన్స్ టెన్షన్. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ కాస్త డ్రయ్ సబ్జెక్ట్ అని అనుమానం వుంది.
మాతృక అయిన తమిళ సినిమా సబ్జెక్ట్ తెలుసు. అది పవర్ స్టార్ ఇమేజ్ కు ఏ మేరకు సెట్ అవుతుంది అని అనుమానం. అయితే తమిళ సినిమాను రచయిత త్రివిక్రమ్ టోటల్ గా కమర్షియల్ టచ్ ఇచ్చి మార్చేసారన్న వార్తలు వినిపిస్తూనే వున్నాయి. దర్శకుడు సముద్రఖని కూడా అదే చెబుతూ వచ్చారు.
ఇప్పుడు ట్రయిలర్ దాన్నే ధృవీకరించింది. పవన్ చేసిన పాత్ర దేవుడి పాత్రే అయినా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ గా తీర్చి దిద్దారు. చలాకీగా, హుషారుగా కనిపించారు పవన్. పాత సినిమాల స్టయిల్స్ టచ్ ఇస్తూనే పవన్ ను దాదాపు సినిమాకు మెయిన్ హీరో అన్నట్లుగా చూపించారు. అయితే సినిమా కథ ఎక్కువగా నడిచేది సాయి ధరమ్ తేజ్ మీద. ఆ వైనం కూడా ట్రయిలర్ లో తొంగి చూసేలా చేసారు.
సినిమా స్క్రీన్ ప్లే ఎలా వుంటుందన్నది పక్కన పెడితే ట్రయిలర్ కట్ బాగానే వుంది. పవన్ ఫ్యాన్స్ ముచ్చటపడేలాగే వుంది. త్రివిక్రమ్ మార్క్ అద్భుతంగా కనిపించే డైలాగులు ఏవీ ట్రయిలర్ లో పడలేదనే చెప్పాలి. త్రివిక్రమ్ డైలాగులే సినిమాకు మైనస్ అవుతాయేమో అనిపించింది ట్రయిలర్ చూస్తే.
కథను కమర్షియల్ గా మార్చగలిగిన త్రివిక్రమ్, దానికి తగిన డైలాగులు సమకూర్చడంలో సక్సెస్ అయ్యారా లేదా అన్నది ట్రయిలర్ లో అయితే తేలలేదు..సినిమాలో తెలుస్తుందేమో?